Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్, కేటీఆర్ తో కవిత సెల్పీ... నిజామాబాద్ లో ముదిరిన ప్లెక్సీ వార్

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. 

BRS MLC Kavitha Flexis in Nizamabad  AKP
Author
First Published Apr 2, 2023, 2:03 PM IST

నిజామాబాద్ : తెలంగాణలో అధికార బిఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి ల మధ్య ప్లెక్సీ వార్ కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చిమరీ మోసం చేసాడంటూ బిఆర్ఎస్ నాయకులు ఇటీవల నిజామాబాద్ లో ప్లెక్సీలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.పసుపు రంగులో ప్లెక్సీ ఏర్పాటుచేసి 'ఇదే మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు' అన్న క్యాప్షన్ తో ప్లెక్సీలు వెలిసాయి. అయితే ముళ్లను ముళ్లుతోనే తియ్యాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అన్నట్లుగా ప్లెక్సీలకు ప్లెక్సీలతోనే జవాభివ్వాలని బిజెపి ఎంపీ అరవింద్ అనుకుంటున్నట్లున్నాడు... అందుకే సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత హామీలను గుర్తుచేస్తూ ప్లెక్సీలు వెలిసాయి. 

గతంలో ఎమ్మెల్సీ కవిత బోధన్ లోని నిజాం షుగర్ ప్యాక్టరీ తెలిపిస్తానంటూ ఇచ్చిన హామీని ఏమయ్యిందని ప్రశ్నిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్లెక్సీలు ఏర్పాటుచేసారు.''చెప్పినట్టు 100 రోజుల్లో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించి మా నాన్న, అన్నతో సెల్పీ..'' అంటూ ఫ్యాక్టరీ వద్ద కేసీఆర్, కేటీఆర్ తో కలిసి కవిత సెల్ఫీ దిగుతున్నట్లుగా ఫోటోలతో ప్లెక్సీ ఏర్పాటుచేసారు. అలాగే డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాపీ, దళితులకు మూడెకరాలు వంటి హామీల గురించి ప్రశ్నిస్తూ ప్లెక్సీలు వెలిసాయి. 

Read More  ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు..: నిజామాబాద్ లో రాత్రికి రాత్రే ప్లెక్సీలు (వీడియో)

ప్రజలను మద్యానికి బానిసలు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు అంటూ మరికొన్ని ప్లెక్సీలు వెలిసాయి.అంతేకాదు కేసీఆర్ ఫార్మ్ హౌస్,  కవితకు దుబాయ్ లోని బూర్జ్ ఖలిఫాలో ప్లాట్, ఎమ్మెల్యేకు జీ1 మాల్ సరే... మరి నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఏవి? అంటూ మరికొన్ని ప్లెక్సీలు వెలిసాయి. ఇలా నిజామాబాద్ పట్టణంలోనే కాదు శివారు ప్రాంతాలు, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో ఎమ్మెల్సీ కవిత, బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటయ్యాయి. 

అయితే ఈ ప్లెక్సీల ఏర్పాటు బిజెపి నాయకుల పనేనని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. పసుపు బోర్డు గురించి పసుపు రైతులు ప్లెక్సీలు ఏర్పాటుచేసారని... వాటినుండి ప్రజల దృష్టిని మరల్చడానికే బిజెపి ఎంపీ అరవింద్ ఇలా ప్లెక్సీలు ఏర్పాటుచేసారని ఆరోపించారు. ఇలా ఇంతకాలం హైదరాబాద్ లో సాగిన ప్లెక్సీల గొడవ తాజాగా నిజామాబాద్ కు పాకింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios