తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంచేసే బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అడ్డుకోవడంపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు. ఆర్టీసీ బిల్లుకు ఎవరు అడ్డు పడుతున్నారో... గవర్నర్ ను ఎవరు ఆడిస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఆర్టిసి కార్మికుల కోసం మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీలో మంచి బిల్లును ప్రవేశ పెట్టారు... కానీ ఆ బిల్లును గవర్నర్ ఆమోదించడం లేదన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో వున్న గవర్నర్ ను వెనక ఎవరున్నారో అందరికి తెలుసని కవిత అన్నారు.

తెలంగాణ సిద్దాంతకర్త ప్రొ. జయశంకర్ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటుచేసిన ప్రొ. జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కవిత పూలమాల వేసి నివాళి అర్పించారు.

వీడియో

ఈ సదర్భంగా ఏర్పాటుచేసిన సభలో కవిత మాట్లాడుతూ... తెలంగాణను ఆంధ్రాలో కలపొద్దని చిన్నతనంనుండే జయశంకర్ సార్ పోరాటం చేసారని కవిత తెలిపారు. ఆ తర్వాత కూడా తెలంగాణ కోసం పోరాడేవారికి ఆయన స్పూర్తిగా నిలిచారన్నారు.ఇలా కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడేందుకు ముందుకురాగా జయశంకర్ సార్ అండగా నిలిచారని అన్నారు. ఎంతమంది అవమానించినా ఎక్కడ అధైర్య పడకుండా తెలంగాణ ఉద్యమంలో ముందుకు సాగారని అన్నారు. ప్రతి ఒక్కరికి స్పూర్తిగా నిలిచిన జయశంకర్ సార్ జయంతి రోజున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా వుందన్నారు. 

Read More ఆర్టీసీ భూములపై కేసీఆర్ కుటుంబం కన్ను: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో భారీ వర్షాలు కురిసి వరదలతో ప్రజలు నష్టపోయినా కేంద్రం ఒక్క రూపాయి సాయం చేయలేదని కవిత అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత అన్ని జిల్లాలో మెడికల్ కాలేజిలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. కళ్యాణ లక్ష్మీ , షాది ముబారక్ లాంటి పథకాలు తీసుకొచ్చి ప్రతి ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వు చూస్తున్నామని అన్నారు. ఇలా కేసీఆర్ సర్కార్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని కవిత అన్నారు.