Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్‌తో కల్వకుంట్ల కవిత భేటీ... సీబీఐ విచారణపై వివరణ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ విచారణకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరిస్తున్నారు. 

BRS MLC Kalvakuntla kavitha meets cm kcr
Author
First Published Dec 11, 2022, 8:31 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటలకు పైగా ఆమెను విచారించారు సీబీఐ అధికారులు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కవిత మీడియాతో మాట్లాడతారని అంతా భావించారు. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె కార్యకర్తలకు అభివాదం చేసి కారెక్కి ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. అనంతరం తన తండ్రి, సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ విచారణకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. కవిత వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వున్నారు. 

ఇదిలావుండగా.. కవిత  నుండి సమాచారం సేకరించేందుకు గాను  సీబీఐ అధికారులు రావడానికి అరగంట ముందే  న్యాయవాదులు  కవిత ఇంటికి వచ్చారు. సీబీఐ అధికారులు కవిత న్యాయవాది సమక్షంలో ఈ విషయమై సమాచారాన్ని సేకరిస్తున్నారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో   ఈడీ అధికారులు అరెస్ట్  చేసిన అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో కవిత  పేరు ఉంది. అమిత్ ఆరోరా  రిమాండ్ రిపోర్టు  వెలుగు చూసిన మరునాడే  కవితకు సీబీఐ అధికారులు  నోటీసులు జారీ చేశారు.  160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులిచ్చారు. ఈ నోటీసులకు ఈ నెల 6వ తేదీన  తాను  సిద్దంగా ఉంటానని కవిత  తొలుత సమాచారం ఇచ్చారు.

Also Read:ఢిల్లీ లిక్కర్ స్కాం : ముగిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ... 7 గంటలకుపైగా ప్రశ్నల వర్షం

ఈ నెల 3వ తేదీన ఉదయం ప్రగతి భవన్ లో  కేసీఆర్ ,కవితలు న్యాయ నిపుణులతో ఈ విషయమై చర్చించారు.  ఈ చర్చలు ముగిసిన తర్వాత  సీబీఐకి  కవిత లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించి  చార్జీషీట్, ఎఫ్ఐఆర్‌ను పంపాలని కవిత లేఖ రాసింది. ఈ లేఖలకు సంబంధించి సీబీఐ కవితకు సమాచారం పంపింది. అయితే ఎఫ్ఐఆర్, చార్జీషీట్లలో తన పేరు లేదని కవిత పేర్కొన్నారు. అంతేకాదు  ఈ విషయమై  సీబీఐకి సహకరిస్తానని కవిత  స్పష్టం చేశారు. ఈ నెల 11,12, 14, 15 తేదీల్లో  తాను హైద్రాబాద్ లో ఉంటానని  సీబీఐకి సమాచారం పంపారు.  ఈ సమాచారంపై సీబీఐ అధికారులు ఈ నెల 6వ తేదీన స్పందించారు. ఈ నెల  11న సమాచార సేకరణకు వస్తామని కవితకు  సీబీఐ అధికారులు మెయిల్ ద్వారా సమాచారం పంపారు. ఈ కేసులో సమాచార సేకరణలో భాగంగా  కవిత  ఇంటికి ఇవాళ సీబీఐ అధికారుల బృందం  వచ్చింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios