బీఆర్ఎస్ అభ్యర్ధి నామినేషన్.. ‘‘ గులాబీ ’’ అంబాసిడర్ నడిపిన కల్వకుంట్ల కవిత (వీడియో)
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బిగాల గణేష్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కవిత.. కారు నడిపి సందడి చేశారు. గులాబీ రంగు వేసిన అంబాసిడర్ కారును గణేష్ గుప్తా ఇంటి నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు కవిత డ్రైవ్ చేశారు.
బీఆర్ఎస్ అభ్యర్ధుల తరపున ఆ పార్టీ అగ్రనేతలు సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి తోడుగా ఎమ్మెల్సీ కవిత కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తన వాడి వేడి విమర్శలతో విపక్షాలకు కౌంటరిస్తున్నారు. ఇవాళ.. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బిగాల గణేష్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కవిత.. కారు నడిపి సందడి చేశారు.
గులాబీ రంగు వేసిన అంబాసిడర్ కారును గణేష్ గుప్తా ఇంటి నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు కవిత డ్రైవ్ చేశారు. ఆమెను బీఆర్ఎస్ శ్రేణులు అనుసరించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న బోథన్ ఎమ్మెల్యే అభ్యర్ధి షకీల్ నామినేషన్ సందర్భంగా కవిత స్కూటీ నడపిన సంగతి తెలిసిందే.
మరోవైపు.. నిజామాబాద్ అర్భన్‌లో బీజేపీ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో గణేష్ గుప్తా ఈసారి కూడా గెలుస్తారని కవిత జోస్యం చెప్పారు. అలాగే దక్షిణ భారతదేశంలో వరుసగా మూడుసార్లు సీఎం అయిన చరిత్ర ఎవరికీ లేదని.. కేసీఆర్ ఈసారి హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టిస్తారని కవిత ఆకాంక్షించారు.