తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం.. : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవిత
Hyderabad: తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణమని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఇందిరాగాంధీ అణిచివేశారనీ, రాజీవ్ గాంధీ అప్పటి సీఎం టి.అంజయ్యను అవమానించారని అన్నారు. అలాగే, హైదరాబాద్ రాష్ట్రాన్ని నెహ్రూ బలవంతంగా ఆంధ్రాలో కలిపారని ఆరోపించారు.
BRS MLC Kalvakuntla Kavitha: తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణమని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఇందిరాగాంధీ అణిచివేశారనీ, రాజీవ్ గాంధీ అప్పటి సీఎం టి.అంజయ్యను అవమానించారని అన్నారు. అలాగే, హైదరాబాద్ రాష్ట్రాన్ని నెహ్రూ బలవంతంగా ఆంధ్రాలో కలిపారని ఆరోపించారు.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. గెలుపుపై ఎవరివారు ధీమాతో ఉన్నారు. ఇదే క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోని బీఆర్ఎస్ తెలంగాణలో మెరుగైన పాలన అందిస్తున్నదనీ, ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
తెలంగాణ వెనుకబాటుతనానికి కాంగ్రెస్సే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి సోనియాగాంధీ వరకు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. నిజామాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కవిత మాట్లాడుతూ.. నెహ్రూ బలవంతంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఇందిరాగాంధీ అణచివేశారనీ, రాజీవ్ గాంధీ అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్యను అవమానించారని ఆమె ఆరోపించారు.
ప్రత్యేక తెలంగాణ తీర్మానాన్ని పక్కనపెట్టి చూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుందని కవిత ఆరోపించారు. తెలంగాణ ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న సంబంధాలు ప్రతికూలంగా ఉన్నాయని రాహుల్ గాంధీ అంగీకరించారని ఆమె చెప్పారు. అంతకుముందు, బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ అమర్ తో కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలనుద్దేశించి కవిత మాట్లాడుతూ రాహుల్ గాంధీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే పోచంపాడ్ ప్రాజెక్టుగా పిలిచే శ్రీరాంసాగర్ నిర్మాణం ప్రారంభమైందన్నారు. అయితే, కాంగ్రెస్ నిర్లక్ష్యంతో అది ముందుకు సాగలేదనీ, అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఎట్టకేలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నాలుగు తరాల కాంగ్రెస్ కూడా పూర్తి చేయలేకపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిందన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయిందన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో ఎలా పోటీ పడుతుందని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రిని మార్చాలనుకున్నప్పుడల్లా రాష్ట్రంలో మతకలహాలు జరిగాయని అన్నారు. గత పదేళ్లలో తెలంగాణలో మతకలహాలు జరగలేదన్నారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల మధ్య స్నేహానికి భంగం కలిగించకూడదని అన్నారు.