బిఆర్ఎస్ కు మరో షాక్... రేవంత్ రెడ్డితో సిట్టింగ్ ఎమ్మెల్యే భేటీ (వీడియో)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బిఆర్ఎస్ కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు టిపిసిపి చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఆదిలాబాద్ : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణ రాజకీయాలు జోరందుకున్నాయి. ఇప్పటికే అధికార బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడమే కాదు బీఫారాలు కూడా అందజేసారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఇలా ఎన్నికల ప్రచారాన్ని కూడా షురూ చేసి మంచి జోరుమీదున్న అధికార పార్టీకి ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే షాకిచ్చేలా కనిపిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో బిఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం మరోసారి సిట్టింగ్ లకే ఇచ్చారు కేసీఆర్. 115 నియోజకవర్గాల్లో కేవలం ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ నిరాకరించారు. అలాంటి ఎమ్మెల్యేల్లో రాథోడ్ బాపూరావు ఒకరు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఈయనను కాదని భోథ్ నుండి అనిల్ జాదవ్ ను బరిలోకి దింపుతోంది బిఆర్ఎస్. తనకు బిఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో వున్న బాపూరావు పార్టీ మారేందుకు సిద్దమయ్యారు.
వీడియో
వచ్చే నెల(నవంబర్ 2023)లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తన రాజకీయ భవిష్యత్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే బాపూరావు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బాపూరావు భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని రేవంత్ ఇంట్లో జరిగిన ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More మాజీ ఎమ్మెల్యే చందర్ రావుతో ఉత్తమ్ భేటీ:కాంగ్రెస్ లోకి వేనేపల్లి
తనకు బోథ్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ చేరడానికి సిద్దంగా వున్నట్లు బాపూరావు టిపిసిసి చీఫ్ కు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది... ఈ నేపథ్యంలో తనకు సీటు ఇస్తానంటే కాంగ్రెస్ లో చేరతానని బాపూరావు కోరుతున్నారు. టికెట్ హామీ లభిస్తే బోథ్ ఎమ్మెల్యే బాపూరావు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇది అధికార బిఆర్ఎస్ కు ఎదురుదెబ్బే.