ఎంపీ ల్యాడ్స్ నిధులను వాడుకున్నానంటూ బీజేపీ నేత , ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎంపీ లాడ్స్ నిధుల వాడకంపై బీజేపీ అధిష్టానం కలగజేసుకుని వాస్తవాలు బయటకు తీయాలని జోగు రామన్న డిమాండ్ చేశారు.
తన ఇంటి కోసం, కుమారుడి పెళ్లి కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులను వాడుకున్నానంటూ బీజేపీ నేత , ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. ఎంపీ లాడ్స్ నిధుల వాడకంపై బీజేపీ అధిష్టానం కలగజేసుకుని వాస్తవాలు బయటకు తీయాలని జోగు రామన్న డిమాండ్ చేశారు. అటు సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేశారంటూ బాపూరా చేసిన వ్యాఖ్యలపైనా రామన్న స్పందించారు.
బీజేపీ నేతలు మాట్లాడితే దేశం, ధర్మం లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని దుయ్యబట్టారు. ఎంపీ లాడ్స్ నిధులను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్న సోయం బాపూరావు ఇప్పుడు మాట మార్చి.. తనపై సొంత పార్టీ నేతలే కుట్ర చేశారని అంటున్నారని దుయ్యబట్టారు. నిజంగానే ఎంపీ లాడ్స్ నిధులను వాడుకుంటే బాపూరావుపై చట్టపరంగా చర్యలు తప్పవని జోగు రామన్న హెచ్చరించారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో సోయం బాపూరావు మాట్లాడిన వీడియో ఒకటి నిన్న బయటకు వచ్చింది. ఈ సందర్భంగా తాను ఎంపీ లాడ్స్ నిధులను సొంతానికి వాడుకున్నానని చెప్పారు. అంతేకాదు.. ఎంపీ లాడ్స్‌లో ప్రతి రూపాయిను తిరిగి లబ్ధిదారులకు ఇస్తున్నట్లు తెలిపారు.
