బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలేలా ఉన్నది. సీనియర్ లీడర్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ మందుల సామేల్ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. తుంగతుర్తి టికెట్ ఆశించినా దక్కే అవకాశాలు లేనందునే కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి అసంతృప్తులు బయటకు వెళ్లిపోతున్నారు. కీలక నేతలు పొంగులేటి, జూపల్లిలు ఇప్పటికే పార్టీ వీడారు. త్వరలోనే వారు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇంకా చాలా మంది నేతలు బీఆర్ఎస్ వీడుతారనే చర్చ జరుగుతున్న తరుణంలో గులాబీ పార్టీకి మరో షాక్ తగిలింది.
సీనియర్ లీడర్, గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ మందుల సామేల్ బీఆర్ఎస్ వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ రోజు సమావేశం నిర్వహించి దీనికి సంబంధించిన స్పష్టత ఇవ్వనున్నారు. ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తారని ఇప్పటికే ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి.
మందుల సామేల్ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాడు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని ఆశించాడు. స్థానికుడైన తనకు తుంగతుర్తి టికెట్ ఇవ్వాలని సామేల్ పార్టీని కోరినట్టు తెలిసింది. కానీ, కేటీఆర్ వ్యాఖ్యలతో ఆయనకు స్పష్టత వచ్చింది. దీంతో పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Also Read: కాంగ్రెస్‌లో అంతర్గత ఆధిపత్య పోరు.. ఖమ్మం భారీ సభ.. ఎవరిది పైచేయి?
తుంగతుర్తి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ను మూడో సారి గెలిపించాలని పురపాలక మంత్రి కేటీఆర్ నిన్న తిరుమలగిరిలో పేర్కొన్నారు. దీంతో తుంగతుర్తి టికెట్ గాదరి కిషోర్‌కే అనే విషయం విస్పష్టమైంది. దీంతో ఈ సారి కూడా తుంగతుర్తి టికెట్ తనకు దక్కేలా లేదని భావిస్తున్నాడు. అందుకే బీఆరఎస్‌కు రాజీనామా చేసి వేరి పార్టీ టికెట్‌పై బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
