Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ బ్యూటీ కంగనాను వదిలిపెట్టని కేటీఆర్... ఇచ్చిపడేసాడుగా...

భారతీయ జనతా పార్టీ నాయకులపై మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికన సెటైర్లు వేసారు. ఇటీవల ప్రధాని పదవి విషయంలో ఇద్దరు బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై కేటీఆర్ ఇలాా స్పందించారు...

BRS Leader KTR Satires on BJP Leader Kangana Ranaut and Annamalai AKP
Author
First Published Apr 5, 2024, 1:50 PM IST

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారతీయ జనతా పార్టీ నాయకులకు చురకలు అంటించారు. ఇటీవల సినీ నటి, బిజెపి ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ భారత ప్రధానిగా స్వాతంత్య్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ పనిచేసారంటూ కామెంట్స్ చేసారు. దీనిపైనే తాజాగా కేటీఆర్ స్పందిస్తూ బిజెపి నాయకులపై  సెటైర్లు వేసారు.  

''ఉత్తర భారతదేశం నుండి పోటీచేసే ఓ బిజెపి అభ్యర్థి సుభాష్ చంద్రభోస్ మన దేశ తొలి ప్రధాని అంటున్నారు!! దక్షిణాదికి చెందిన మరో బిజెపి నేత మహాత్మా గాంధీ మన ప్రధాని అంటున్నాడు. వీళ్లంతా ఎక్కడ గ్రాడ్యుయేట్స్ అయ్యారు?'' అంటూ కేటీఆర్ ట్వీట్ చేసారు. 

 

అసలు కంగనా ఏమన్నారంటే : 

సినీ నటి కంగనా రనౌత్ ఈ లోక్ సభ ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నుండి పోటీ చేస్తున్నారు. చాలాకాలంగా బిజెపికి మద్దతుగా వుంటూ వస్తున్న కంగనా ఎట్టకేలకు ఆ పార్టీలో చేరిపోయారు. ఇలా ఎంపీగా పోటీ చేస్తున్న ఆమె టైమ్స్ నౌ నిర్వహించిన సమ్మిట్ లో పాల్గొన్నారు. 

భారత దేశానికి బ్రిటీష్ వాళ్ల నుండి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పరిస్థితుల గురించి కంగనా ప్రస్తావించారు. ఈ సందర్భంగా మన దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్లిపోయారంటూ కామెంట్ చేసారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కంగనాపై సోషల్ మీడియా ట్రోల్స్ కు కారణమయ్యాయి. 

గతంలోనూ కంగనా రనౌత్ నేతాజీ-గాంధీజీ మధ్య సంబంధం గురించి మాట్లాడి తీవ్ర విమర్శల పాలయ్యారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సుభాష్ చంద్రబోస్ ను బ్రిటీష్ వాళ్లకు అప్పగించేందుకు గాంధీజీ, జవహార్ లాల్ నెహ్రూ ప్రయత్నించారని కంగనా ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలను చంద్రబోస్ కూతురు అనితా బోస్ ఖండించారు. తన తండ్రి చంద్రబోస్ తో పాటు గాంధీజీ కూడా దేశానికి స్వాతంత్ర్య కోసం పోరాడారని... అయితే ఒకరు ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి పోరాటంతో, మరొకరు అహింసతో సాధించాలని అనుకున్నారని అన్నారు. వీరి మార్గాలు వేరయినా లక్ష్యం మాత్రం ఒక్కటేనని అన్నారు. చంద్రబోస్, గాంధీజీ మధ్య సత్సంబంధాలే వుండేవని అనిత బోస్ పేర్కొన్నారు. 

తమిళనాడు బిజెపి చీఫ్ కూ కేటీఆర్ కౌంటర్ : 

ఇక తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై పైనా కేటీఆర్ పరోక్షంగా సెటైర్లు వేసారు. మన దేశ ప్రధాని మహాత్మా గాంధీ అంటూ అన్నామలై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి వాళ్లంతా ఎక్కడినుండి గ్రాడ్యుయేట్స్ అవుతారంటూ  సెటైర్లు వేసారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios