Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి ఓ గజదొంగ .. ఆయనపై ఎన్నో కేసులు, నా మీద ఒక్కటైనా వుందా : కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ అభ్యర్ధి కడియం శ్రీహరి. రేవంత్ రెడ్డి ఓ గజ దొంగ అని వ్యాఖ్యానించారు. తనపై ఒక్క కేసు లేదని.. కానీ స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్ధి ఇందిర, రేవంత్ లపై పలు కేసులున్నాయని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. 

brs leader kadiyam srihari sensational comments on tpcc chief revanth reddy ksp
Author
First Published Nov 14, 2023, 7:34 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ అభ్యర్ధి కడియం శ్రీహరి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన ప్రసంగిస్తూ.. రేవంత్ రెడ్డి ఓ గజ దొంగ అని వ్యాఖ్యానించారు. తనపై ఒక్క కేసు లేదని.. కానీ స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్ధి ఇందిర, రేవంత్ లపై పలు కేసులున్నాయని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని మాదిగలపై ప్రేముంటే మీ ఆస్తులు వారికి రాసివ్వాలి ఆయన సవాల్ విసిరారు. ఇందిర ఆస్తులు రాసిచ్చిన మరుక్షణమే నా ఆస్తులు మొత్తం రాసిస్తానని శ్రీహరి స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios