ములుగులో సీతక్కపై మహిళ అభ్యర్థిని దింపిన బీఆర్ఎస్: ఎవరీ నాగజ్యోతి?
ములుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను ఓడించేందుకు బడే నాగజ్యోతిని బీఆర్ఎస్ బరిలోకి దింపింది. నక్సలైట్ల నేపథ్యం ఉన్న కుటుంబం నాగజ్యోతిది.
హైదరాబాద్: ములుగు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్కపై పోటీకి బీఆర్ఎస్ నాయకత్వం బడే నాగజ్యోతిని బరిలోకి దింపింది. ములుగు నుండి సీతక్క గతంలో టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి అదే స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009లో టీడీపీ అభ్యర్ధిగా ఆమె ప్రాతినిథ్యం వచ్చారు. 2014 లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారు. ములుగు నుండి సీతక్క ను ఓడించేందుకు ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ బడే నాగజ్యోతిని బీఆర్ఎస్ బరిలోకి దింపింది. నక్సల్స్ ఉద్యమంలో బడే ప్రభాకర్,ఆయన సతీమణి నిర్మలక్కలు పనిచేశారు. ఈ ఉద్యమంలో పనిచేస్తూనే బడే ప్రభాకర్ , నిర్మలలు మృతి చెందారు . వీరి సంతానమే నాగజ్యోతి.
also read:బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా: ఇద్దరు ఎమ్మెల్సీలకు చోటు
నాగజ్యోతి ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు.ములుగులో బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు నాగజ్యోతి కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ములుగు జిల్లాలోని తాడ్వాయి నుండి బీఆర్ఎస్ జడ్‌పీటీసీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా బీఆర్ఎస్ నాయకత్వం నాగజ్యోతిని నియమించింది. ములుగులో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ములుగులో సీతక్క ను ఓడించేందుకు బడే నాగజ్యోతిని కేసీఆర్ బరిలోకి దింపారు.సీతక్క కూడ నక్సల్స్ ఉద్యమంలో పనిచేశారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఆమె జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత ఆమె టీడీపీలో చేరారు.