Asianet News TeluguAsianet News Telugu

కారును పోలిన గుర్తులు కేటాయించొద్దు: ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్

కారును పోలిన గుర్తులను ఎవరికి కేటాయించవద్దని ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ఇవాళ  ఢిల్లీ హైకోర్టు విచారణ చేసే అవకాశం ఉంది. 

BRS Files  Petition In Delhi High Court   for removal of free symbols identical to Car lns
Author
First Published Oct 12, 2023, 10:11 AM IST


న్యూఢిల్లీ:కారును పోలిన గుర్తులను ఎవరికి కేటాయించవద్దని ఢీల్లీ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్.కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయిస్తే  తమకు నష్టం వస్తుందని ఆ పార్టీ ఆ పిటిషన్ లో పేర్కొంది.

కారును పోలిన గుర్తులు కేటాయించవద్దని గతంలో సీఈసీని బీఆర్ఎస్ కోరింది. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడ  కారును పోలిన గుర్తులను కేటాయించడంతో తమ పార్టీ అభ్యర్థులకు దక్కాల్సిన ఓట్లు  ఇతరులకు  పోలయ్యాయని బీఆర్ఎస్  చెబుతుంది.  రోడ్డు రోలర్ వంటి  గుర్తుల కేటాయించవద్దని కోరుతుంది. కారును పోలిన గుర్తులను  కేటాయించవద్దని ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన సీఈసీకి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. ఇదే విషయమై బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై  ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ నిర్వహించనుంది. 

కారును పోలిన గుర్తుల కారణంగా  తమ పార్టీల అభ్యర్థులు  కొన్ని చోట్ల ఓటమి పాలైన విషయాన్ని కూడ బీఆర్ఎస్ నేతలు  గుర్తు చేస్తున్నారు.  ఈ తరహా గుర్తులను కేటాయించవద్దని కోరుతున్నారు.బీఆర్ఎస్ తరపున  న్యాయవాది మోహిత్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.రోడ్డు రోలర్,  టెలివిజన్, కుట్టు మిషన్, చపాతీ రోలర్,  కెమెరా, సోప్ డిష్, ఆటోరిక్షా, ట్రక్ వంటి గుర్తులను ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించవద్దని  ఈసీని  బీఆర్ఎస్ కోరింది.

ఇదే విషయమై గతంలో  ఈసీకి  బీఆర్ఎస్ వినతిపత్రాలు సమర్పించింది.ఈ విషయమై  ఈసీ  ఇండిపెండెంట్లకు గుర్తుల కేటాయింపులో కొన్ని జాగ్రత్తలను తీసుకుంది.   టోపీ,ఐరన్ బాక్స్, ఆటోరిక్షా,రోడ్డు రోలర్ వంటి ఇతర గుర్తుల కేటాయించడం లేదని  బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే రోడ్డు రోలర్ గుర్తును తిరిగి  కేటాయించడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో  రోడ్డు రోలర్ గుర్తు కేటాయింపు విషయమై చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలోనే  రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios