Mancherial: తెలంగాణలో దళితులకు భూమి ఇవ్వడంలో ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖర రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని  బీఆర్ఎస్ స‌ర్కారు విఫలమైందని కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే విమ‌ర్శించారు. భార‌త రాజ్యాంగ నిర్మాత‌ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడిన ఖర్గే, ఆయ‌న వ‌ల్లే దళితులు, మహిళలకు ఓటు హక్కు లభించిందన్నారు. 

Congress president Mallikarjun Kharge: దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చలేద‌ని బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. తనలాంటి సామాన్య నేపథ్యం ఉన్న వ్యక్తి సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కలిగి ఉండి ఎమ్మెల్యే, ఎంపీ కాగలగడం తమ పార్టీ (కాంగ్రెస్) వల్లనే సాధ్యమైందన్నారు. తెలంగాణలో దళితులకు భూమి ఇవ్వడంలో ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖర రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ స‌ర్కారు విఫలమైందని ఆరోపించారు. భార‌త రాజ్యాంగ నిర్మాత‌ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడిన ఖర్గే, ఆయ‌న వ‌ల్లే దళితులు, మహిళలకు ఓటు హక్కు లభించిందన్నారు.

తెలంగాణలోని మంచిర్యాలలో శుక్రవారం రాత్రి జరిగిన జై భారత్ సత్యాగ్రహ సభలో ఆయన ప్రసంగిస్తూ ఇందిరాగాంధీ, సోనియాగాంధీ తనలాంటి పేదవాడిని ప్రోత్సహించకపోయి ఉంటే తాను శాసనసభ్యుడిని అయ్యేవాడిని కాదన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం సోనియా గాంధీ తనకు ఇచ్చారనీ, ఇది చాలా పెద్ద బాధ్యత అని ఆయన అన్నారు. 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలిన 24 గంటల్లోనే రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చి లోక్ స‌భ‌ నుంచి అనర్హుడిగా ప్రకటించార‌నీ, అయితే గుజరాత్ కు చెందిన బీజేపీ ఎంపీ క్రిమినల్ కేసులో దోషిగా తేలినప్పటికీ అనర్హత వేటు వేయలేదని అధికార పార్టీ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌కత్వంలోని బీజేపీ స‌ర్కారును టార్గెట్ చేస్తూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచిందనీ, వాగ్దానం చేసిన విధంగా కోట్లాది ఉద్యోగాలను సృష్టించలేదని ఆరోపించారు. ఉన్న ఉపాధి అవ‌కాశాల‌ను సైతం దెబ్బతీస్తున్నార‌ని విమ‌ర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడిన ఖర్గే, రాజ్యాంగ నిర్మాత వల్లే దళితులు, మహిళలకు ఓటు హక్కు లభించిందన్నారు. కాగా, తెలంగాణలోని మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం జై భారత్ సత్యాగ్రహ సభను నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కొమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ స‌హా ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Scroll to load tweet…