అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు తలనొప్పి: టిక్కెట్టు ఇవ్వొద్దంటున్న అసమ్మతి నేతలు

అంబర్‌పేట అసెంబ్లీ  సెగ్మెంట్ లో  బీఆర్ఎస్ కు చెందిన అసమ్మతి నేతలు సమావేశమయ్యారు.  సిట్టింగ్ ఎమ్మెల్యే  కాలేరు వెంకటేష్ కు  టిక్కెట్టు ఇవ్వవద్దని  కోరుతున్నారు.

BRS dissident Leaders Demanding  replace  MLA Candidate in  Amberpet Assembly Segment lns


హైదరాబాద్:నగరంలోని అంబర్ పేట సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు చిక్కులు తప్పడం లేదు.  వెంకటేష్ కు టిక్కెట్టు ఇవ్వవద్దని  అసమ్మతి నేతలు కోరుతున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో  కాలేరు వెంకటేష్  కాంగ్రెస్ నుండి  బీఆర్ఎస్ లో చేరారు.

అంబర్ పేట అసెంబ్లీ స్థానం నుండి కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్ అభ్యర్థిగా  పోటీ చేసి విజయం సాధించారు. ఈ అసెంబ్లీ స్థానం నుండి వరుసగా విజయం సాధిస్తున్న బీజేపీ అభ్యర్థి  కిషన్ రెడ్డిపై  వెంకటేష్ విజయం సాధించారు.  అయితే  వెంకటేష్ కు  ఈ దఫా టిక్కెట్టు ఇవ్వవద్దని  స్థానిక బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు.

మాజీ కార్పోరేటర్లు, పలువురు బీఆర్ఎస్  నేతలు  కాలేరు వెంకటేష్ కు  టిక్కెట్టు ఇవ్వవద్దని కోరుతున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  రేపు  అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.  ఈ తరుణంలో  వెంకటేష్ కు టిక్కెట్టు ఇవ్వవద్దని  అసంతృప్త నేతలు  తమ గళాన్ని మరింత పెంచారు. 

also read:ఉప్పల్‌లో తెరపైకి బండారు లక్ష్మారెడ్డి పేరు: కవితతో భేతి, బొంతు భేటీ

ఈ దఫా  11 మంది సిట్టింగ్ లను మార్చాలని  కేసీఆర్ భావిస్తున్నారు. ఈ తరుణంలో అసమ్మతి నేతలు  సిట్టింగ్ లకు  టిక్కెట్లు ఇవ్వవద్దని  బీఆర్ఎస్ అధిష్టానం వద్ద తమ డిమాండ్ ను  విన్పిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios