ఉప్పల్‌లో తెరపైకి బండారు లక్ష్మారెడ్డి పేరు: కవితతో భేతి, బొంతు భేటీ

ఉప్పల్ ఎమ్మెల్యే   భేతి సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్  బొంతు రామ్మోహన్ లు  ఇవాళ కవితతో భేటీ అయ్యారు.
 

BRS  MLA  Bethi Subash Reddy  Meets BRS MLC  Kalvakuntla Kavitha lns


హైదరాబాద్: ఉప్పల్ ఎమ్మెల్యే బి. సుభాష్ రెడ్డి , జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లు ఆదివారంనాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు.  ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు  ఈ దఫా బీఆర్ఎస్  టిక్కెట్టు దక్కదనే ప్రచారం సాగుతుంది.  ఉప్పల్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే  బండారి లక్ష్మారెడ్డి  పేరును బీఆర్ఎస్  నాయకత్వం  పరిశీలిస్తుందనే  ప్రచారం సాగుతుంది. దీంతో  భేతి సుభాష్ రెడ్డి,బొంతు రామ్మోహన్  లు కవితతో భేటీ కావడం  ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్టును  జీహెచ్ఎంసీ మాజీ మేయర్  బొంతు రామ్మోహన్ రావు ఆశిస్తున్నారు. కొంతకాలంగా  ఉప్పల్ లో పోటీకి  రామ్మోహన్ రంగం సిద్దం చేసుకుంటున్నారు.  ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని మార్చుతున్నారనే ప్రచారం సాగుతుంది.మాజీ ఎమ్మెల్యే  బండారు లక్ష్మారెడ్డిని బరిలోకి దింపుతారనే  చెబుతున్నారు. అయితే  ఈ ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవితతో  భేతి సుభాష్ రెడ్డి,  బొంతు రామ్మోహన్ రావులు  భేటీ కావడం  చర్చకు దారి తీసింది.  

also read:బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రేపే: 105 మందితో జాబితా

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రేపు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో ఈ ఇద్దరు నేతలు  కవితతో భేటీపై  రాజకీయంగా  పలు రకాల చర్చలు సాగుతున్నాయి.ఉప్పల్ నియోజకవర్గంలో పరిస్థితులను కవితకు ఈ ఇద్దరు వివరించినట్టుగా సమాచారం. తమ ఇద్దరిలో ఎవరికో ఒకరికి టిక్కెట్టు ఇవ్వాలని కూడ కవితను కోరినట్టుగా  సమాచారం.ఈ విషయమై  పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని  కవితను  ఈ ఇద్దరు నేతలు  కోరినట్టుగా  చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో  విజయం సాధించే అభ్యర్థులను  పోటీకి దింపాలని బీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేసింది.  ఈ మేరకు సర్వేలు, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను  ప్రకటించాలని  బీఆర్ఎస్ నాయకత్వం  ప్రయత్నిస్తుంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios