ప్రత్యర్థుల దాడిలో అన్నదమ్ముల హతం, నిజామాబాద్ లో దారుణం

Brothers killed while playing cricket in nizamabad
Highlights

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నగర నడిబొడ్డున ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు నరికి చంపారు. అందరూ చూస్తుండగానే నగరంలోని ఓ మైదానంలో  అన్నదమ్ములను పట్టుకుని కత్తులతో దాడి చేశారు. దీంతో అన్నా,తమ్ముడు మృతి చెందగా వారి స్నేహితుడొకరు తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విదంగా ఉన్నాయి. నగరంలోని హమాల్ వాడి ప్రాంతానికి చెందిన కళ్యాణ్ యాదవ్(30), నర్సింగ్ యాదవ్(28) అన్నదమ్ములు. వీరు అదే కాలనీకి చెందిన ఓ వర్గంతో గతంలో పలుమార్లు గొడవ పడ్డారు. దీంతో వీరిపై కక్షతో రగిలిపోతున్న ప్రత్యర్థులు అదును కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ అన్నదమ్ములిద్దరిపై నిన్న అర్థరాత్రి సమయంలో మరో ఇద్దరు యువకులు కత్తులతో దాడికి దిగారు. మొదట తమ్ముడు నర్సింగ్ యాదవ్ ను కత్తులతో చాతిపై పొడవడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత అన్న కళ్యాణ్ యాదవ్ ని పట్టుకున్న దుండగులు అతడి గొంతు కోశారు. అయితే వీరి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రేమ్ కుమార్ పైనా దాడిచేశారు. ఇలా దుండగుల దాడిలో గాయపడిన కళ్యాణ్ యాదవ్ కూడా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

ఈ దాడిలో గాయపడిన ప్రేమ్ కుమార్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఈ దారుణానికి పాల్పడిన నిందితులు తల్వార్ సాయి, రంజిత్ లను అరెస్ట్ చేశారు.  వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

loader