Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్: మైనర్ చెల్లిపై అన్న అత్యాచారం, హత్య... ఆలస్యంగా వెలుగులోకి

వావివరసలు మరిచి వరసకు అన్నయ్య అయ్యే యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా అతి కిరాతకంగా పురుగుల మందు తాగించి చంపిన దారుణంగా చంపిన ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. 

Brother rapes 14 year old minor sister at karimnagar
Author
Karimnagar, First Published Oct 7, 2021, 10:30 AM IST

కరీంనగర్: వావివరసలు మరిచి చెల్లి వరసయ్యే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. అంతేకాకుండా ఎక్కడ ఈ విషయం బాలిక బైటపెడుతుందోనన్న అనుమానంతో ఆమెతో పురుగులమందు తాగించి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణం చాలారోజుల క్రితమే కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే.... karimnagar జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామంలో ఓ మైనర్ బాలిక(14) తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. అయితే అన్న వరసయ్యే(చిన్నమ్మ కొడుకు) మహేష్ బాలికపై కన్నేసాడు. వావివరసలు మరిచి బాలికపై అఘాయిత్యానికి పాల్పడి అతి దారుణంగా హతమార్చాడు. 

చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన  నిందితుడు మహేష్ ఇంట్లో బాలిక ఒంటరిగా వున్నట్లు తెలుసుకుని బైక్ పై బాలయ్యపల్లికి చేరుకున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికతో పురుగుల మందు తాగించి చంపాడు. ఈ విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపి మహేష్ పై ఫిర్యాదు చేశారు. 

read more  విశాఖ మైనర్ బాలికపై రెండు నెలలుగా లైంగికదాడి... ఆ రాత్రి కూడా యువకుడితోనే..: పోలీస్ విచారణలో సంచలనాలు

అయితే ఈ ఘటన జరిగి మూడునెలలు గడుస్తున్నా పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోవడంలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో నిందితుడు మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత వదిలిపెట్టారని... ఆ తర్వాత అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. 

ఇప్పటికే కూతురిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న తల్లిదండ్రులు తమకు పోలీసులు కూడా న్యాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఇలా పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తాజాగా మరోసారి బాలిక తండ్రి స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు మరోసారి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగేలా చూడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios