కరీంనగర్‌: మద్యం మత్తు మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో తెలియజేసే సంఘటన ఒకటి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఫూటుగా మద్యం సేవించిన ఓ యువకుడు వావివరసలు మరిచి సొంత చెల్లిపైనే అత్యాచారయత్నానికి పాల్పడి చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 

వీడియో

మానవ సంబంధాలకు మచ్చలా నిలిచే ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్ లో ఓ కుటుంబం నివాసముంటోంది. ఈ కుటుంబానికి చెందిన సతీష్ ( 35 ) అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. ఇలా తాజాగా కూడా మద్యం మత్తులోనే ఇంటికి వచ్చాడు. 

read more  పెళ్లిరోజున భార్యను హత్య చేసిన భర్త

మద్యం మత్తులో వున్న సతీష్ ఇంట్లో చెల్లి ఒంటరిగా వుండటాన్ని గమనించాడు. దీంతో వావివరసలు మరిచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచార ప్రయత్నం చేసిన సోదరుడిని ఎంత వేడుకున్నా వదిలిపెట్టలేదు. దీంతో యువతి తన  మానాన్ని కాపాడుకోడానికి సోదరుడిని రోకలిబండతో తలపై బాదింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే మరణించాడు. 

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో మాన రక్షణకు ఇలా చేశానని ఆమె వెల్లడించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించిన పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.