Asianet News TeluguAsianet News Telugu

బాసర ట్రిపుల్ ఐటీ క్లాస్ రూమ్‌లో ఊడిన పెచ్చులు.. విద్యార్ధి తలకు గాయం

ఇప్పటికే వరుస ఆందోళనలు, ధర్నాలతో అట్టుడుకుతోన్న బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఓ భవనం నుంచి పెచ్చులు ఊడటంతో ఓ విద్యార్ధి తలకు గాయమైంది. 

Broken Roof Particles in basara iiit
Author
Basara, First Published Aug 11, 2022, 6:11 PM IST

గత కొన్నిరోజులు వార్తల్లో నిలుస్తోన్న బాసర ట్రిపుల్ ఐటీలో మరో ఘటన చోటు చేసుకుంది. పెచ్చులూడి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దీమాత్ అనే విద్యార్ధి తలకు గాయం కావడంతో తోటి విద్యార్ధులు, బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ ఘటనపై విద్యార్ధులు భగ్గుమంటున్నారు. 

ఇకపోతే బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అంతకుముందు రెండు వారాల క్రితం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ 24 గంటల పాటు ఆందోళనకు దిగారు.  విద్యార్ధులతో ఇంచార్జీ వీసీ వెంకటరమణ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. దీంతో విద్యార్ధులు ఈ నెల 1వ తేదీ నుండి క్లాసులకు హాజరౌతున్నారు. ఈ ఏడాది జూన్ మాసంలో వారం రోజుల పాటు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. ఈ ఏడాది జూన్ 20వ తేదీ వరకు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. జూన్ 21వ తేదీ నుండి విద్యార్ధులు క్లాసులకు హాజరయ్యారు. అయితే గత మాసంలో బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ ఫాయిజన్ కావడంతో ఒక్క విద్యార్ధి మరణించాడు. దీంతో రెండు వారాల క్రితం  విద్యార్ధులు 24 గంటల పాటు ఆందోళన నిర్వహించారు. 

ALso REad:బాసర ట్రిపుల్ ఐటీకి తమిళిసై: విద్యార్ధులతో కలిసి టిఫిన్

కాగా.. ఈ నెల 7న బాసర ట్రిపుల్ ఐటీలోని హస్టల్ గదులు, పరిసరాలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరిశీలించారు. మెస్ భవనాన్ని కూడా తమిళిసై చూశారు. విద్యార్ధులతో కలిసి ఆమె టిఫిన్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యా బోధనతో పాటు వసతి సౌకర్యాల గురించి గవర్నర్ తమిళిసై విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్ధులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్ధుల సమస్యలను విన్న గవర్నర్ వీటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హమీ ఇచ్చారు. బాసర ట్రిపుట్ ఇంచార్జీ వీసీ వెంకటరమణ సహా పలువురితో గవర్నర్  తమిళిపై విద్యార్ధుల సమస్యలపై చర్చించారు. విద్యార్ధులు ఏకరువు పెట్టిన సమస్యలపై ఆమె అధికారులను అడిగారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios