Asianet News TeluguAsianet News Telugu

కారులో తిరగకపోతే తోచదు.. మాస్కు చూస్తే వణికిపోతాడు.. విచిత్ర సమస్య...

లాక్ డౌన్ తో ఇంటికే పరిమితం కావడంతో రకరకాల మానసిక సమస్యలతో బాధపడడం పెద్దవారిలోనే కాదు పిల్లల్లోనూ కనిపిస్తోంది. బైటికి వెళ్లి కాసేపు అలా గాలి పీల్చుకుని రాకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు చాలామంది. అలాంటిదే ఓ విచిత్ర సంఘటన హైదరాబాద్ లో జరిగింది. 

boy has autism and he wants to go in car in lockdown - bsb
Author
Hyderabad, First Published May 28, 2021, 10:46 AM IST

లాక్ డౌన్ తో ఇంటికే పరిమితం కావడంతో రకరకాల మానసిక సమస్యలతో బాధపడడం పెద్దవారిలోనే కాదు పిల్లల్లోనూ కనిపిస్తోంది. బైటికి వెళ్లి కాసేపు అలా గాలి పీల్చుకుని రాకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు చాలామంది. అలాంటిదే ఓ విచిత్ర సంఘటన హైదరాబాద్ లో జరిగింది. 

హైపర్ యాక్టివ్ గా ఉండే ఆటిజం పిల్లలను ఈ లాక్ డౌన్ వేళ ఇంటికే పరిమితం చేయడం, వారిని ఎంగేజ్డ్ గా ఉంచడంతల్లిదండ్రులకు కత్తిమీద సాము లాంటిది. అలాంటి అబ్బాయి పార్థ శివరామ్ (17). అతను రోజూ ఓ గంటపాటు కారులో బయట తిరగకుంటే కుదురుగా ఉండలేడు. 

చిరాకుతో అతని ప్రవర్తన బీభత్సంగా తయారవుతుంది. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర చేసి, పగలగొట్టి దెబ్బలు తగిలించుకోవడం.. అవి పట్టించుకోకుండా పరుగులు పెట్టడం చేస్తాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. ఈ విషయాన్ని చెప్పే అతని తల్లి డాక్టర్ ఎన్. నాగలక్ష్మి పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకుని లాక్ డౌన్ టైంలో కాసేపు సిటీలో చక్కర్లు కొట్టింది.

కార్ఖానా పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో నివసించే  నివసించే డాక్టర్ ఎన్. నాగలక్ష్మికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అమెరికాలో చదువుతుండగా, చిన్న కొడులు పార్థ శివరామ్ (17) ఆమెతోనే ఉంటున్నాడు. శివరామ్ కు ఆటిజం.

బీజేపీలోకి ఈటల రాజేందర్: ముహుర్తం ఇదే.....

రోజూ ఓ గంటపాటు కారులో బయట తిప్పాలి లేకుంటే... నానా హంగామా చేస్తాడు. అంతేకాదు మాస్కు పెట్టుకున్న వారిని చూసినా, పెట్టుకున్నా భయాందోళనకు గురవుతాడు. 

ఈ విషయాల్ని తల్లి నాగలక్ష్మి ఇన్స్ పెక్టర్ మధుకర్ స్వామికి వివరించింది. దీంతో వారు బయట కాసేపు తిరగడానికి మానవతా దృక్పథంలో అనుమతినిచ్చారు. అంతేకాదు మాస్క్ అంటే భయపడతాడని మాస్క్ తీసే అతనితో కాసేపు, నవ్వుతో పలకరించి, మాట్లాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios