హైద్రాబాద్ గచ్చిబౌలిలో రోలింగ్ షట్టర్‌లో చిక్కుకొని ఓ బాలుడు మరణించాడు. బాలుడి మృతికి కారణమైన వారిని శిక్షించాలని మృతుడి కుటుంబసభ్యులు కోరుతున్నారు. 


హైదరాబాద్: హైద్రాబాద్ గచ్చిబౌలిలో రోలింగ్ షట్టర్‌లో చిక్కుకొని బాలుడు మరణించాడు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాలుడి పేరేంట్స్ డిమాండ్ చేస్తున్నారు.హైద్రాబాద్ గచ్చిబౌలిలోని అక్షయ్‌నగర్‌లోని ఓ భవనంలో ఓ బైక్ షోరూం ఉంది. ఈ షోరూం ఉన్న భవనానికి వాచ్‌మెన్ గా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అర్జున్ వాచ్‌మెన్ గా పనిచేస్తున్నాడు. అర్జున్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే నివాసం ఉంటున్నాడు.

బుధవారం నాడు ఉదయం బైక్ షోరూం షట్టర్ తీస్తున్న సమయంలో వాచ్ మెన్ అర్జున్ కొడుకు రోలింగ్ షట్టర్ కు చిక్కుకొన్నాడు. దీంతో అతను కేకలు వేశాడు. ఈ అరుపులు విన్న స్థానికులు వచ్చి రోలింగ్ షట్టర్ కు చిక్కుకొన్న బాలుడిని స్థానికులు బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.షట్టర్ నుండి బయటకు తీసిన కొద్దిసేపటికే బాలుడు మరణించాడు.

బైక్ షోరూం తో పాటు భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకొందని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.