ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అనేది కామన్ అయిపోయింది. చాలా మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్‌లే కనిపిస్తున్నాయి. అయితే తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వడం లేదని పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకు గురిచేసే అంశమనే చెప్పాలి.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అనేది కామన్ అయిపోయింది. చాలా మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్‌లే కనిపిస్తున్నాయి. పిల్లలు కూడా ఫోన్లలో గేమ్స్ ఆడేందుకు బాగా అలవాటు పడిపోతున్నారు. పోన్ లేనిదే రోజు గడవదు అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. అయితే తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వడం లేదని పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకు గురిచేసే అంశమనే చెప్పాలి. తాజాగా పదో తరగతి పరీక్షలు రాసిన ఓ విద్యార్థి.. తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని వాజేడు మండలం మురుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రగళ్లపల్లి కి చెందిన పాయం సాయి లికిత్.. ఇటీవల పదోతరగతి పరీక్షలు రాశాడు. ప్రస్తుతం సాయి లిఖిత్ ఇంట్లోనే ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని సాయి లిఖిత్ కొద్ది రోజులుగా అలకతో ఉన్నాడు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం సాయి లిఖిత్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. అయితే సాయంత్రమైనా కొడుకు ఇంటికి రాకపోవడంతో సాయి లిఖిత్ తల్లి సుశీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇక, వెంకటాపురంమండల పరిధిలోని పాలెం వాగు ప్రాజెక్టులో బుధవారం ఉదయం సాయి లిఖిత్ మృతదేహం లభ్యమైంది. సాయి లిఖిత్ ప్రాజెక్ట్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
