ఎంపి కవిత ను కలిసిన బాక్సర్ నిఖత్ జరీన్

ఎంపి కవిత ను కలిసిన బాక్సర్ నిఖత్ జరీన్

బాక్సర్ నిఖత్ జరీన్ నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ను బుధవారం హైదరాబాద్ లోని ఎంపి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా జరీన్ ను ఎంపి కవిత అభినందించారు.

ఇటీవల బేలెగ్రేడ్ లో జరిగిన 56వ అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెల్సిందే. జరీన్ తో పాటు అసాముద్దీన్ అంతర్జాతీయంగా తెలంగాణ కు పేరు ప్రఖ్యాతులు సాధించి పెట్టారని ప్రశంసించారు. వీరిద్దరూ నిజామాబాద్ కు చెందిన వారు కావడం నిజామాబాద్ వాసులకు సంతోషకరమైన విషయమన్నారు.

తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, క్రీడాకారులకు అవసరమయిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నదని ఎంపి కవిత తెలిపారు. వీటిని ఉపయోగించుకుని క్రీడాకారులు తమ నైపుణ్యాలను అభివృద్ధి పర్చుకోవాలని కోరారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos