ఓ ఉద్యోగినికి వాట్సాప్ లో ఆమె బాస్ మెసేజ్ చేశాడు. హలో... అంటూ ప్రాజెక్టు వర్క్ పై మాట్లాడాడు.  నీ పర్ఫార్మెన్స్ పూర్ గా ఉంది అని చెప్పాడు.  దీంతో ఆమె లేదు సార్ మొత్తం నేనే చేశాను అని చెప్పగా కాదు అని చెప్పాడు.  దీంతో భయాందోళనకు గురైన ఆమె నా భవిష్యత్ అంటూ వాపోయింది. 

హైదరాబాద్ : మహిళలు చిన్నారులపై వేధింపులు, అఘాయిత్యాల నివారణకు సైబరాబాద్ పోలీస్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఐటీ పరిధిలో ఉద్యోగినులు కూడా వేధింపులకు గురవుతున్నారు. తమ భవిష్యత్.. సమాజంలో గౌరవం వంటి విషయాలతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు.

అలాంటి వారి కోసం వాట్సాప్ నెంబర్ తో ఫిర్యాదులు స్వీకరించేందుకు సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఆ వాట్సాప్ నెంబర్ కు బాగా స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో వాట్స్అప్ కు వచ్చిన ఓ ఫిర్యాదు చూస్తుంటే పని ప్రాంతాల్లో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం అవుతుంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా సైబరాబాద్ మహిళ రక్షణ వింగ్ ట్విటర్ లో బహిర్గతం చేసింది.

ఓ ఉద్యోగినికి వాట్సాప్ లో ఆమె బాస్ మెసేజ్ చేశాడు. హలో... అంటూ ప్రాజెక్టు వర్క్ పై మాట్లాడాడు. నీ పర్ఫార్మెన్స్ పూర్ గా ఉంది అని చెప్పాడు. దీంతో ఆమె లేదు సార్ మొత్తం నేనే చేశాను అని చెప్పగా కాదు అని చెప్పాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె నా భవిష్యత్ అంటూ వాపోయింది. ఏం కంగారు పడొద్దు... నీకు ప్రమోషన్, జీతం పెంపు చేస్తా అని వరాలు కురిపించాడు. కానీ, కానీ... అంటూ గ్యాప్ ఇచ్చాడు. ఆ ‘కానీ’ లో ఎంతో దురుద్దేశం దాగి ఉంది.

కానీ ఏంటి సార్ అని అడగగా అతడి వక్రబుద్ధి బయటపడింది. ఆమెను ఓయో రూమ్ లో కలుద్దాం అని అడిగాడు. దీంతోపాటు మొదటినుంచి నీపై క్రష్ ఉంది అని చెప్పాడు. దీనికి ఆ యువతి క్షమించండి సార్.. అనగానే సరే ‘నీ ప్రమోషన్, జీతం పెంపు విషయంలో కూడా సారీ’ అని ఆ బాస్ చెప్పేశాడు.

అతడి స్పందనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలు ‘నీ కెరీర్ ను కాపాడుకో’ అంటూ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2003 కింద కేసు నమోదు చేశా అని సమాధానం చెప్పింది.

అయితే అతడి వేధింపులు ఎప్పటినుంచో ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే అతడి పేరును డైనో‘సార్’ అని పెట్టుకోవడం చూస్తుంటే అది అర్థం అవుతుంది.