జూలై 15 నుంచి బోనాల పండుగ

bonalu 2018 began from july 15
Highlights

జూలై 15 నుంచి బోనాల పండుగ

జంట నగరాల్లో అత్యంత వైభవంగా జరిగే బోనాల పండుగ ఈ ఏడాది జూలై 15 నుంచి ప్రారంభంకానున్నాయి. బోనాల పండుగ నిర్వహణపై ఇవాళ తెలంగాణ సచివాలయంలో మంత్రులు తలసాని,  పద్మారావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల ఏర్పాట్లు గురించి తలసాని మీడియాకు వివరించారు.  

జూలై 29న మహంకాళి అమ్మవారికి బోనాలు.. 30వ తేదిన రంగం కార్యక్రమం ఉంటుందని.. కోటి రూపాయల ఖర్చుతో 3 కిలోల 80 గ్రాముల బంగారంతో అమ్మవారికి బోనం తయారు చేయనున్నట్లు తలసాని తెలిపారు.. ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని.. జంట నగరాల్లో 145 ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తలసాని వివరించారు.. అనంతరం మహంకాళి అమ్మవారి బంగారు బోనం నమూనాను మంత్రి విడుదల చేశారు.

loader