Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో బోనాల ఉత్సవాలు: గోల్కొండ బోనాలు నేడే ప్రారంభం

తెలంగాణలో బోనాల ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు.  గోల్కొండ బోనాల ఉత్సవాలు ఇవాళ ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాలకు గాను ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు
 

bonala festivals starts from today lns
Author
Hyderabad, First Published Jul 11, 2021, 10:59 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నుండి బోనాల సందండి ప్రారంభమైంది. ప్రతి ఆషాడమాసం ఆదివారం నాడు గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కోండ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.గత ఏడాది కరోనా కారణంగా గోల్కొండ బోనాలను నిరాడంబరంగా నిర్వహించారు. భక్తులను అనుమతించలేదు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో  ఈ దఫా  బోనాలకు భక్తులను అనుమతించారు. అలాగే ఉజ్జయిని మహంకాళి బోనాలను పురస్కరించుకొని ఘటోత్సవం కూడ ఆదివారం నాడు ప్రారంభం కానుంది.నెల రోజుల పాటు గోల్కొండ అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుగుతాయి.

గోల్కొండకోటపై కొలువు దీరిన అమ్మవారిని చోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్లి అక్కడ అమ్మవారిని అలంకరించుకొని భారీ ఊరేగింపు నడుమ ఆదివారం కోటపైకి తీసుకెళ్లి ప్రతిష్టిస్తారు. పోతరాజుల నృత్యాలు, బ్యాండు మేళాలు, భక్తకోటి కోలాహలం, తొట్టెల ఊరేగింపు కన్నుల పండువగా సాగుతాయి. 

మొదటి పూజలో అమ్మవారికి మొదటి నజర్‌ బోనం సమర్పించనున్నారు. 32 అడుగుల ఎత్తైన భారీ తొట్టెలను కూడా మొదటి పూజలో సమర్పించనున్నారు. నేడు లంగర్‌హౌస్‌ చౌరస్తా నుండి ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్‌ బోనం, తొట్టెల తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది.  

లంగర్‌హౌస్‌లో ప్రారంభమ్యే ఊరేగింపులో మంత్రులు, ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. చోటాబజార్‌లోని ప్రధాన పూజారి ఇంట్లో పూజలు నిర్వహించి అక్కడి నుండి బోనాలతో అమ్మవారిని పల్లకిలో ఊరేగించి కోటపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించడంతో మొదటి పూజ ముగియనుంది. 

చోటాబజార్‌లోని ప్రధాన పూజారి ఇంట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి అమ్మవారిని, నగలతో పాటు పల్లకిలో ఊరేగింపుగా కోటపైకి తీసుకెళతారు. అమ్మవారిని నగలతో అలంకరించి, తొలిబోనం సమర్పిస్తారు. 

మొదటి బోనం తరువాత భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించే రోజుకు మరో ప్రత్యేకత ఉంది. ఈ నెల 18 న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహిస్తారు. నగరంలోని ప్రధాన దేవాలయాలైన సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి, మీరాలం మండి అమ్మవారు, లాల్‌ దర్వాజ అమ్మవార్లతో పాటు వి విధ దేవాలయాల నుండి దాదాపు 100కు పైగా తొ ట్టెల సామూహిక ఊరేగింపు నిర్వహించనున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios