Asianet News TeluguAsianet News Telugu

బోయినపల్లి వినోద్‌కుమార్‌: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

Boinapally Vinod Kumar Biography: కరీంనగర్‌ మాజీ ఎంపీ, మలిదశ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం మొదలైన అంశాలు. 

Boinapally Vinod Kumar Biography, Age, Caste, Children, Family, Political Career KRJ
Author
First Published Mar 19, 2024, 1:01 PM IST

Boinapally Vinod Kumar Biography: 

బాల్యం, కుటుంబం 

బోయినపల్లి వినోద్ కుమార్ 1959, జూలై 22న మురళీధర్ రావు, సుగుణదేవి దంపతులకు తెలంగాణలోని కరీంనగర్ లో జన్మించాడు. వినోద్ కుమార్ తండ్రి వరంగల్ జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేసేవారు. తండ్రిది వరంగల్ జిల్లా, ఎనుగల్ గ్రామంలోని వ్యవసాయ కుటుంబం. ఆయన తల్లి గారిది కరీంనగర్ జిల్లాలోని నాగారంకు చెందిన ప్రముఖ రాజకీయ కుటంబం. స్వాతంత్ర్య సమరయోధులు చెన్నమనేని రాజేశ్వరరావు, మాజీ ప్రణాళికా సంఘం సభ్యుడు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం మాజీ చాన్సెలర్ చెన్నమనేని హన్మంతరావు, సామాజిక కార్యకర్త చెన్నమనేని వెంకటేశ్వర్రావు,  బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావులు వినోద్ కుమార్ కు మేనమామలు.

విద్యాభ్యాసం

వినోద్ కుమార్ విద్యాభ్యాసం విషయానికి వస్తే.. వరంగల్ జిల్లా దేశాయిపేట గ్రామంలోని నెహ్రూ మెమోరియల్ స్కూల్ లో తన పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తరువాత హనుమకొండ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, కాకతీయ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం లోని ఎల్ ఎల్ బీ చేశాడు.  

ప్రారంభ జీవితం  

ఎల్ ఎల్ బీ పూర్తి చేసిన తరువాత 1984లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1998 వరకు వరంగల్ జిల్లాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ లోని హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుగా పనిచేశాడు.

రాజకీయ జీవితం 

వినోద్ కుమార్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 14 సంవత్సరాల్లోనే భారతీయ కమ్యూనిస్టు పార్టీ యొక్క విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) లో చేరాడు. విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా స్టూడెంట్ లీడర్ గా ఎదిగారు. క్రమంగా రాష్ట్ర, జాతీయ సంఘాలలో పలు పదవులను చేపట్టారు. మరోవైపు.. వివిధ ప్రజా ఉద్యమాలు, ఆందోళనలలో కూడా ఆయన పాల్గొన్నాడు.

ఈ తరుణంలోనే  1970లో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరి, పార్టీలో వివిధ పదవులను నిర్వహించాడు. వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా కూడా పనిచేశాడు. రాజకీయాలలోనే కాకుండా వివిధ ప్రజా ఉద్యమాలు, ప్రపంచ శాంతి జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని ఇండో-సోవియట్ సాంస్కృతిక సమాజంలో క్రియాశీల సభ్యులుగా వ్యవహరించారు. అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమంలో వినోద్ కుమార్ క్రియశీలకంగా వ్యవహరించారు. ప్రత్యేక తెలంగాణ ఎజెండా ఏర్పాటైన ఆనాటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఈయన కూడా ఒకరు.   

చేపట్టిన పదవులు

>> 2004లో తొలిసారి హనుమకొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ సమయంలో స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా వ్యవహరించారు.

>> తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆయన తన లోక్ సభ సభ్యత్వానికి 3 మార్చి 2008ను రాజీనామా చేశారు.

>>ఆ తరువాత 2008 జూన్ లో జరిగిన ఉప ఎన్నికలో  తిరిగి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

>>2014లో రెండవసారి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు. ఈ తరుణంలో నీటి వనరులపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా వ్యవహరించారు.

>> అలాగే.. కన్సల్టేటివ్ కమిటీ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల్లో కీలక బాధ్యతలు చేపట్టారు.

>>2015లో భూసేకరణ, పునరావాసం, పునరావాస బిల్లు 2015లో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కుపై జాయింట్ కమిటీ సభ్యుడుగా వ్యవహరించారు.

>>2016లో భద్రతా ప్రయోజనాల అమలు, రుణాల రికవరీ చట్టాలు,  ఇతర నిబంధనల (సవరణ) బిల్లు 2016పై జాయింట్ కమిటీ సభ్యుడుగా వ్యవహరించారు

>>2017 లో పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌పై కమిటీ సభ్యుడుగా

>>2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. . బోయినపల్లి వినోద్ కుమార్ ను 2019 ఆగస్టు 16న రాష్ట్రప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించారు.

>>2004 - 2014 మధ్య కాలంలో వివిధ వార్తాపత్రికలలో ఎన్నో వ్యాసాలు రాశారు. 

బి. వినోద్ కుమార్ బయోడేటా 

పేరు: బోయినపల్లి వినోద్ కుమార్ 
రాజకీయ పార్టీ: బీఆర్ఎస్      
తండ్రి: బి. మురళీధర్ రావు
తల్లి: బి. సుగుణాదేవి
పుట్టిన తేది: 22 జూలై 1959
జన్మస్థలం: కరీంనగర్ (తెలంగాణ)
జీవిత భాగస్వామి: డాక్టర్ బి. మాధవి
విద్యార్హతలు: ​    B.Sc., LL.B.
వృత్తి: న్యాయవాది, రాజకీయవేత్త,

Follow Us:
Download App:
  • android
  • ios