పాపం...ఈ సంగీతకు జ్వరం వచ్చింది

పాపం...ఈ సంగీతకు జ్వరం వచ్చింది

పాపం ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు భర్త చేతిలో చిత్రహింసలకు గురై తన పాపతో సహా  భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన సంగీత అనారోగ్యం పాలయ్యింది. ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. గత నాలుగురోజులుగా భర్త ఇంటిముందే ధర్నా చేస్తున్న ఆమె రాత్రి సమయాల్లోను అక్కడే పడుకుంటోంది. దీంతో తీవ్ర చలి వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిని ఉంటుందని అక్కడ ఆమెతో పాటు ధర్నా చేస్తున్న మహిళలు తెలిపారు. 


ఆమె భర్త టీఆర్ఎస్ యూత్ లీడర్ శ్రీనివాసరెడ్డి ఇప్పటికే అరెస్ట్ కాగా, అత్తమామలు పరారీలో ఉన్నారు.  తనకు అత్తా మామలు గాని ప్రభుత్వం గాని హామీ ఇచ్చే వరకు ఇంటిముందే కూర్చుంటానంటునని సంగీత తెగేసి చెబుతోంది. తన ఆరోగ్యం పాడైనా ఇక్కడినుంచి కదిలే ప్రసక్తే లేదని అంటోంది. తనకు, తన కూతురికి అండగా నిలబడేలా ఈ కుటుంబాన్ని ఒప్పించాలని ప్రభుత్వ పెద్దలను సంగీత వేడుకుంటున్నట్లు సంగీత తెలిపింది.    

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos