Asianet News TeluguAsianet News Telugu

నడిసంద్రంలో నావ.. తెలుగు రాష్ట్రాల గోడవ

  • నందికొండలో తెలంగాణ లాంచీని నిలిపివేసిన ఏపీ అధికారులు
  • అటవీశాఖ అనుమతి లేనందునే అడ్డుకున్నట్లు వివరణ
  • తెలుగు రాష్ట్రాల గొడవ మధ్య ఇబ్బందిపడ్డ ప్రయాణికులు
boat issue

విభజన జరిగి రెండున్నర ఏళ్లు దాటిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణలు మాత్రం తగ్గడం లేదు. సెంటీ మీటర్ సమస్యను కూడా కిలోమీటర్ రేంజ్లో చూపించి కొట్టుకునేవరకు వెళ్లిపోవడం రెండు రాష్ట్రాలకు కామన్ గా మారింది. తాజాగా తెలంగాణ పర్యాటక లాంచీ ఒకటి నాగార్జునసాగర్‌లోని నంది కొండపై వెళ్లింది. ఇది ఏపీ ప్రాంతంలోకి వస్తుంది. దీంతో ఆ రాష్ట్ర అధికారులు తెలంగాణ లాంచీని మధ్యలోనే నిలిపివేశారు. తొలి రోజే తమ పర్యాటక లాంచీని కావాలనే ఏపీ అధికారులు అడ్డుకున్నారని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు ఆరోపించారు. అయితే తమ రాష్ట్ర అటవీశాఖ అనుమతి ఇవ్వనందువల్లే లాంచీని ఆపివేసినట్లు, ఇందులో ఏలాంటి దురుద్దేశం లేదని ఏపీ అధికారులు వివరణ ఇచ్చారు. కానీ, రెండు రాష్ట్రాల మాటలు ఎలా ఉన్నా.. వీకెండ్ రోజుల్లో సరదాగా నాగార్జున సాగర్ అందాలను వీక్షిద్దామని ఆశతో వచ్చిన పర్యాటకులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

‘లాంచీని నందికొండలో ఆపి పర్యాటకులకు అసౌకర్యం కలిగించడం సరికాదు. విహారయాత్రకు వచ్చిన పర్యాటకులను ఇబ్బందులు పెడుతారా? సమస్యలు ఉంటే రెండు రాష్ట్రాల అధికారులు మాట్లాడుకోవాలే తప్ప ఇలా చేయడం పద్ధతికాదంటూ ఓ పర్యాటకుడు రెండు రాష్ట్రాల తీరుపై మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios