కొత్తగూడెం: తెలంగాణ బొగ్గు గని  కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వల్లే తాను బీఎంఎస్‌లో  చేరినట్టుగా  కెంగర్ల మల్లయ్య చెప్పారు. కవితను నమ్ముకొని తాను నష్టపోయినట్టుగా ఆయన చెప్పారు.

మంగళవారం నాడు భదాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు బొగ్గు గని కార్మిక సంఘాన్ని స్థాపించినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఈ సంఘానికి తాను నాయకత్వం వహించినట్టుగా ఆయన చెప్పారు. తనను అడుగడుగునా అవమానాలకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పైరవీకారులకు పగ్గాలను అప్పగించారని ఆయన ఆరోపించారు. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరినట్టుగా టీబీజీకేఎస్‌లో చొరబడ్డ కొన్ని శక్తులు యూనియన్‌ను చిన్నాభిన్నం చేశారని ఆయన ఆరోపించారు.

గత మాసంలో కెంగర్ల మల్లయ్య తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి  బీఎంఎస్‌లో చేరారు.

also read బిఎంఎస్‌లోకి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత మల్లయ్య? ...