నానక్‌రామ్ గూడలో భారీ పేలుళ్లు

blasts at  Nanakramguda of Hyderabad
Highlights

హైద్రాబాద్ నానక్ రామ్ గూడలో భారీ పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. వరుసగా నాలుగు దఫాలు పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. శుక్రవారం సాయంత్రం పూట  ఈ పేలుళ్లు సంభవించినట్టు పోలీసులు తెలిపారు.


హైదరాబాద్: హైదరాబాద్ నానక్ రామ్ గూడలో శుక్రవారం సాయంత్రం భారీ పేలుళ్లు చోటు చేసుకొన్నాయి.. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

వరుసగా నాలుగు భారీ పేలుళ్లు చోటు చేసుకొన్నాయని సమాచారం.  నిర్మాణంలో ఉన్న ఫోనెక్స్ భవనంలో పేలుళ్లు చోటు చేసుకొన్నాయని సమాచారం. పేలుళ్ల దాటికి భవనం పక్కనే ఉన్న టిప్పర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. బండరాళ్లు ఎగిసిపడ్డాయి. ఈ భవనంలో కార్మికులు ఉన్నారని చెబుతున్నారు.ఘటనా స్థలానికి పోలీసులు ఎవరినీ కూడ అనుమతించడం లేదు.

ఈ ఘటనలో నలుగురు మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఇద్దరు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. జిలిటెన్ స్టిక్స్ పేలినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పోలీసులు ఎవరినీ అనుతించడం లేదు.

పుప్పాల గూడ ఫినిక్స్ సెజ్‌లో ఈ పేలుళ్లు సంభవించాయని, బ్లాస్టింగ్ వల్ల ఈ పేలుళ్లు జరగలేదని, పేలుడు సామాగ్రి తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర రావు చెప్పారు అందుకే టిప్పర్‌తో సహా ఆ ప్రాంతంలో ధ్వంసమయ్యాయని అన్నారు.

సురేష్ అనే సూపర్ వైజర్, రమేష్ అనే డ్రైవర్‌లకు గాయాలయ్యాయని చెప్పారు. వారిని కాంటినెంటల్ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, పేలుళ్ల కోసం ముందస్తు అనుమతి తీసుకున్నారా లేదా అనేది పరిశీలిస్తామని చెప్పారు.

loader