సింగరేణి బొగ్గు తవ్వకాల్లో విషాదం చోటు చేసుకుంది. పనులు నిర్వహిస్తుండగా బుధవారం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కార్మికులపైకి బొగ్గు పెళ్లలు దూసుకురావడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిని సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వీరిలో రట్నం లింగయ్య అనే కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో అతనిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతుండగా లింగయ్య మరణించినట్లు వైద్యులు తెలిపారు.  ప్రమాదంలో గాయపడ్డ మరో ముగ్గురు కార్మికుల్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

అంతకుముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను కార్మిక సంఘాల నేతలు పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు.