హైదరాబాద్: సికింద్రబాదులో పేలుడు సంభవించింది. సికింద్రాబాదులోని చెత్తకుండీలో విస్ఫోటనం సంభవించింది. సికింద్రాబాదు ముత్యాలమ్మ దేవాలయం వద్ద గల చెత్తకుండీలో ఈ పేలుడు సంభవించింది.

కెమికల్ డబ్బా పేలడం వల్ల ఈ విస్ఫోటనం సంభవించినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. తెత్త ఏరుకునే వ్యక్తి గాయపడినట్లు నిర్ధారించారు.  వివరాలు తెలియాల్సి ఉంది.

ఆదివారం తెల్లవారు జాము నుంచే హైదరాబాదులో పండుగ వాతావరణం నెలకొంది. పలు ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.