బిగ్ బ్రేకింగ్ : కేసీఆర్ పై మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

First Published 16, Nov 2017, 6:15 PM IST
bjym leader complained about KCR in Mahankali Police Station
Highlights
  • కేసీఆర్ పై మహంకాళి పోలీస్ స్టేషన్లో పిర్యాధు
  • అమరవీరులను అవమానించాడంటూ పిర్యాదు చేసిన బిజెవైఎం నాయకుడు

తెలంగాణ అమరవీరులను అసెంబ్లీ సాక్షిగా అవమాన పర్చిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలంటూ సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయ్యింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులనుద్దేశించి అవమానకరంగా మాట్లాడినట్లు భరత్ రాజ్ అనే బిజేవైఎం నాయకుడు కంప్లైంట్ చేశాడు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించేలా కేఆర్ వ్యవహరించాడని అతడు తన పిర్యాదులో పేర్కొన్నాడు. అధికారంలోకి వచ్చాక అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటానని చెప్పిన కేసీఆర్ ఇపుడు అమరుల కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నాడు. ఇలా అమరవీరుల ఆశయాలను కాలరాస్తుండటమే కాకుండా, వారిని అవమానించిన సీఎం పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొన్నాడు.

loader