Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డి జిల్లాలో .. మంత్రి హరీశ్ రావుకు నిరసన సెగ, ‘‘గో బ్యాక్’’ అంటూ నినాదాలు

కామారెడ్డి జిల్లా పిట్లంలో మంత్రి హరీశ్ రావుకు నిరసన సెగ తగిలింది. హరీశ్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. నిరుద్యోగ భృతి చెల్లించాలంటూ బీజేపీ యువ మోర్చా ఆందోళనకు దిగింది. 

bjym activists protest against minister harish rao in kamareddy
Author
First Published Dec 3, 2022, 2:36 PM IST

కామారెడ్డి జిల్లా పిట్లంలో మంత్రి హరీశ్ రావుకు నిరసన సెగ తగిలింది. నిరుద్యోగ భృతి చెల్లించాలంటూ బీజేపీ యువ మోర్చా శనివారం ఆందోళనకు దిగింది. హరీశ్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. అక్కడే వున్న పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Also REad:సిద్ధిపేట : ఎమ్మార్వో కార్యాలయం ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత... బీజేపీ- టీఆర్ఎస్ శ్రేణుల బాహాబాహీ

ఇకపోతే.. గత నెలలో సిద్ధిపేటలో కొత్తగా నిర్మించిన అక్బర్‌పేట్ భూంపల్లి ఎంఆర్‌వో కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావుతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. అయితే బీజేపీ , టీఆర్ఎస్ కార్యకర్తలు పోటీపోటీ నినాదాలు చేశారు. తర్వాత ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే అక్కడే వున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios