Asianet News TeluguAsianet News Telugu

దుబ్బాక: కేసీఆర్ కు షాక్, టీఆర్ఎస్ మీద బిజెపి తొలిదెబ్బ

 దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం టీఆర్ఎస్‌ను షాక్ కు గురి చేసింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని సమయాల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది

BJPs Dubbak by-poll win serves a warning to TRS in Telangana lns
Author
Hyderabad, First Published Nov 10, 2020, 4:43 PM IST


హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం టీఆర్ఎస్‌ను షాక్ కు గురి చేసింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని సమయాల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన ఏ ఉప ఎన్నికల్లో కూడ టీఆర్ఎస్ ఓటమి కాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం టీఆర్ఎస్ కు పెద్ద షాక్ గా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాదన కోసం టీఆర్ఎస్ ను 2001 ఏప్రిల్ 27వ తేదీన ఆవిర్భవించింది. ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్ పదవికి, టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేసి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.

ఉప ఎన్నికలను సెంటిమెంట్ రగిల్చి ఉద్యమాన్ని సజీవంగా నిలిపేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు గతంలో చాలా సమయాల్లో ఫలితాలను ఇచ్చాయి.  కానీ ఈ దఫా మాత్రం సిట్టింగ్ సీటును బీజేపీకి కట్టబెట్టాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ కు నెలకొంది.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి చెరుకు ముత్యంరెడ్డిపై ఆయన విజయం సాధించారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి టీఆర్ఎస్ జతకట్టింది. 2004 ఎన్నికల్లో 56 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 26 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించారు.  17 స్థానాల్లో టీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయింది.

2004లో కేసీఆర్ కరీంనగర్ నుండి ఎంపీ స్థానం నుండి గెలిచారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్, నరేంద్రలు మంత్రులుగా చేరారు. 2006 నాటికి రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా కరీంనగర్ ఎంపీ పదవికి కూడ రాజీనామా చేశారు.

ఈ ఎన్నికల్లో కేసీఆర్... జీవన్ రెడ్డిపై రెండు లక్షలకు పైగా మెజారిటీ ఓట్లతో విజయం సాధించారు. ఈ గెలుపుతో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ రగిల్చారు. ఆ తర్వాత 2008లో కూడ టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేశారు.16 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే  7 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ విజయం సాధించింది. 2008లో కరీంనగర్ నుండి మరోసారి పోటీ చేసిన కేసీఆర్ కేవలం 15 వేల ఓట్ల మెజారిటీతోనే గెలుపొందారు.

2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ టీడీపీ, లెఫ్ట్ పార్టీలు మహాకూటమిగా పోటీ చేశాయి. 45 స్థానాల్లో పోటీ చేసి టీఆర్ఎస్ 10 స్థానాల్లో మాత్రమే గెలిచింది.13 చోట్ల టీఆర్ఎస్ కు డిపాజిట్లు రాలేదు. 2010లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 11 స్థానాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
2012లో జరిగిన ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ నాలుగు స్థానాల్లో గెలుపొందింది.2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.

2014 ఎన్నికల్లో  మెదక్ ఎంపీ స్థానంతో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి కేసీఆర్ పోటీ చేశారు.  మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 63 స్థానాలు మాత్రమే దక్కాయి. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ నుండి కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు.

also read:దుబ్బాక బైపోల్: తెలంగాణలో మారుతున్న సమీకరణాలకు కారణమిదీ...

2015 ఆగష్టులో నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి భూపాల్ రెడ్డి విజయం సాధించారు. 2016లో మే 16వ తేదీన జరిగిన పాలేరు ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

2018 ముందస్తు ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందడంతో ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. 

దీంతో 2019 అక్టోబర్ మాసంలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఎన్. పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు.

ఇటీవల అనారోగ్యంతో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఈ స్థానం నుండి ఈ నెల 3వ తేదీన దుబ్బాకకు ఉప ఎన్నిక జరిగింది.ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతపై విజయం సాధించారు.

ఉప ఎన్నికల్లో ఎక్కువ విజయాలు నమోదు చేసిన రికార్డులున్న టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణులను షాక్ కు గురి చేసింది. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఈ ఎన్నికల్లో విజయం సాధించడం టీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిణామమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios