మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో ప్రేమ్ కుమార్ అనే బీజేపీ కార్యకర్త మృతి చెందాడు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీజేపీ  అభ్యర్ధి ఎంపీటీసీగా విజయం సాధించారు. కౌంటింగ్ సమయంలోనే టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి.  ఈ ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్ నేత శ్రీకాంత్ రెడ్డి తండ్రి ఓటమి పాలయ్యాడు.  అయితే తమ పార్టీ అభ్యర్ధి బీజేపీ నేతలు గ్రామంలో విజయోత్సవ ర్యాలీ జరిగే సమయంలో  బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.

ఈ ఘర్షణలో ప్రేమ్ కుమార్ అనే బీజేపీ కార్యకర్త మృత్యువాత పడ్డారు.ప్రేమ్ కుమార్ గతంలో శ్రీకాంత్ రెడ్డికి మధ్య స్వల్ప ఘర్షణలు కూడ ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై  బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.