Asianet News TeluguAsianet News Telugu

Vijayashanti:అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాములమ్మ మరో షాకింగ్ ట్వీట్‌ 

Vijayashanti: గత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ సోషల్ పలు ఆసక్తికర పోస్టులు పెడుతూ అందరి ద్రుష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. మీరు కూడా ఓ లూక్కేయండి.

BJP Vijayashanthi shocking tweet during the current elections  KRJ
Author
First Published Nov 2, 2023, 10:17 AM IST

Vijayashanti: తెలంగాణ మలి ఉద్యమంలో తనకంటూ ప్రత్యేక చరిష్మా సంపాదించుకున్న నాయకురాలు విజయశాంతి అలియస్ రాములమ్మ. తొలుత రాష్ట్ర సాధన కోసం ప్రత్యేక పార్టీ పెట్టి.. అనంతరం బీఆర్ఎస్( అప్పటి టీఆర్ఎస్) పార్టీలో చేరారు. పలు ఉద్యమ ఘట్టాల్లో కీలక భూమిక పోషించారు. కానీ, పలు కారణాలతో ఆమె బీఆర్ఎస్ ను వీడి బీజేపీ లో చేరారు. బీజేపీలో కూడా కీలక నాయకురాలుగా పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లింది. అయితే.. గత కొంతకాలంగా మాజీ ఎంపీ విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో పార్టీని వీడబోతున్నరనే ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. 

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వరుసగా ఆసక్తికర ట్వీట్ చేస్తూ.. మీడియా కంటబడుతున్నారు. ఆమె పార్టీ ఫిరాయించునున్నారనీ, పార్టీ అధిష్టానంపై అసహనంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వేళ సినిమా తీరుగా ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యపడదంటూ.. మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. 

" బీఆర్ఎస్ దుర్మార్గాల నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుండి పోరాడాలి. 7 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా మోసిన వ్యక్తి రాములమ్మ అని కొందరు ఓ వైపు. బీజేపీని విధాన పూర్వకంగా 1998 నుండి విశ్వసించి దక్షిణ భారతంతో పాటు మిగతా అనేక రాష్ట్రాలలో దశాబ్ధ కాలం పైగా పనిచేసిన నేతగా, స్పష్టమైన  హిందూత్వవాదిగా  బీజేపీ వైపు నిలబడాలని మరికొందరు. రెండు అభిప్రాయాలు .

నిజానికి ఇయ్యాల తెలంగాణాల  ఉన్న దుర్మార్గ కేసిఆర్ గారి పరిపాలన పరిస్థితుల నుండి కొట్లాడి మన ఉద్యమకారులం తెచ్చుకున్న రాష్ట్రానికి మేలు కోరకే అయినా.. సినిమా తీరుగా  పోలీస్ లాకప్, రౌడీ దర్బార్, నాయుడమ్మ లెక్క ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాలలో సాధ్యపడదు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలం. అని విజయశాంతి ట్వీట్ చేశారు. 

అంతకు ముందు రోజు.. తన 25 యేండ్ల రాజకీయ ప్రయాణంలో తాను ఎప్పుడూ సంఘర్షణను మాత్రమే ఎదుర్కొన్నాననీ, తాను ఏ రోజూ, ఏ పదవి కోరుకోలేదని పేర్కొన్నారు. తన పోరాటం తెలంగాణ బిడ్డల సంక్షేమం కోసమే తప్ప, ప్రస్తుత బీఆర్ఎస్ కు వ్యతిరేకం కాదని విజయశాంతి మండిపడ్డారు. సీఎం కెసిఆర్ కుటుంబ దోపిడీపైన , కొందరు బిఆర్ఎస్ నేతల అరాచకం పైన పోరాటమే తప్ప, తనతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పని చేసిన కార్యకర్తలపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios