బీజేపీకి చెందిన తెలంగాణ నేతలు బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ శ్రేణులు తమ పార్టీ క్యాడర్ పై దాడులు చేయడంపై కేంద్ర మంత్రులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.
హైదరాబాద్: BJPకి చెందిన తెలంగాణ నేతలు బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay, మాజీ మంత్రి DK Aruna సహా ఆ పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో బీజేపీపై TRS దాడులకు సంబంధించి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు, పార్లమెంట్ కార్యదర్శులకు బీజేపీ బృందం ఫిర్యాదు చేయనుంది. కేంద్ర మంత్రులు, పార్లమెంట్ కార్యదర్శులకు ఫిర్యాదు చేసిన తర్వాత బీజేపీ అగ్రనేతలతో కూడా వారు భేటీ కానున్నారు.
బండి సంజయ్ నేతృత్వంలోని 20 మంది కాషాయ పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. పార్టీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ ఛుగ్ నివాసంలో తొలుత నేతలంతా సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలకు కౌంటర్ ప్లాన్ ను బీజేపీ రచించనుంది. తమ పార్టీ కార్యకర్తలపై దాడులపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేయనున్నారు.
గత ఏడాది చివర్లో కూడా బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను బీజేపీ నేతలు కలిశారు. మరో వైపు కేంద్ర హోంశాఖ మంత్రి Amit shah ను కూడా కలిసి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
తెలంగాణ బీజేపీ నేతలు గత ఏడాది డిసెంబర్ 21న ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. బీజేపీ ఎంపీలు, కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్ కేంద్రంపై విమర్శలు చేస్తోంది. ఈ విషయమై ప్రజలకు వాస్తవాలు వివరించాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. ధాన్యం కోనుగోలు విషయంలో టీఆర్‌ఎస్ చేస్తున్న రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.బీజేపీపై టీఆర్‌ఎస్ చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు. అదే విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూకుడు పెంచాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అమిత్‌షా ఆదేశించారు. త్వరలోనే తెలంగాణలో భారీ బహిరంగా సభ నిర్వహిస్తామని తెలిపారు. దీనికోసం సన్నాహాలు చేసుకోవాలని నాయకులకు అమిత్ షా సూచించారు. ఈ సభకు తాను.. హజరవుతానని పేర్కొన్నారు.
ఈ సమావేశం తర్వాత టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకొంది. ఎన్డీయేతర పార్టీలు, సీఎంలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.దీంతో బీజేపీ కూడా టీఆర్ఎస్ పై విమర్శలను ఎక్కు పెట్టింది. ఈ తరుణంలో బీజేపీ నేతలు ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
గతంలో కూడా టీఆర్ఎస్ చీఫ్ ప్రాంతీయ పార్టీల సీఎంలు, నేతలతో సమావేశాలు నిర్వహించిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ఈ ప్రయత్నంలో విఫలమయ్యారని కాషాయ నేతలు చెబుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయమై టీఆర్ఎస్ తీరును తప్పు పడుతుంది., కాంగ్రెస్ పార్టీ లేకుండా థర్డ్ ఫ్రంట్ సాధ్యం కాదని తేల్చి చెబుతుంది. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేత వి.హనుమంత రావు గుర్తు చేస్తున్నారు.
