హైదరాబాద్:  15 నిమిషాలు పోలీసులు సమయమిస్తే పాతబస్తీలోని అక్రమ వలసదారులను తరిమికొడతామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం నాడు డాక్టర్లతో ఆయన సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.జీహెచ్ఎంసీ మేయర్ గా బీజేపీని గెలిపిస్తే పాతబస్తీలోని బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ రోహింగ్యాలను తరిమివేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

also read:సర్జికల్ స్ట్రైక్స్ : పాతబస్తీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

పాతబస్తీలో రోహింగ్యాల కోసం షెల్టర్ హౌజ్ లను ప్రారంభించారన్నారు. సాక్షాత్తూ హోంమంత్రే ఈ షెల్టర్ హౌజ్ లను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారని తాను చెప్పిన మాటలు వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.

ఎంఐఎంను టీఆర్ఎస్ పెంచిపోషిస్తోందని ఆయన చెప్పారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని సంజయ్ చెప్పారు. పాతబస్తీలో హిందువుల ఓట్లు తొలగించారని ఆయన ఆరోపించారు. పాతబస్తీలో హిందువుల జనాభా ఎందుకు తగ్గుతోందని ఆయన ప్రశ్నించారు.

శాలిబండ, అలియాబాద్, ఉప్పుగూ, లాల్ దర్వాజ, గౌలిపుర, ఛత్రినాక ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడ పోయారని ఆయన అడిగారు.మనుషులకు వచ్చిన రోగాలను తగ్గించే డాక్టర్లు.. సమాజానికి అవినీతి రోగం పట్టిందన్నారు. దీన్ని తగ్గించేందుకు డాక్టర్లు తమ వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు.