ఆదిలాబాద్ ఎంపీ బాపురావు అరెస్ట్: మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పు బట్టారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల సమస్యలు తెలుసుకొనేందుకే బాపురావు వెళ్లే సమయంలో అరెస్ట్ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
హైదరాబాద్: Basara IIT ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల సమస్యలు తెలుసుకొనేందుకు వెళ్తున్న Adilabad MP సోయం బాపురావును అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay తప్పుబట్టారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం నాడు హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకొని వారిని పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీSoyam Bapu Rao ని అరెస్ట్ చేయడంపై సంజయ్ మండిపడ్డారు. బాపురావు స్థానిక ఎంపీ అనే విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ప్రజల కష్టనష్టాలు తెలుసుకొనేందుకు బాపురావు వెళ్తున్న సమయంలో ఆయనను అరెస్ట్ చేయడాన్ని బండి సంజయ్ తప్పు బట్టారు. ఎందుకు ఇలా చేశారో అర్ధం కావడం లేదన్నారు.స్థానిక ఎంపీని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.
also read:ఇక అలా చేస్తే షోకాజ్ నోటీసులు: బాసర ట్రిపుట్ ఐటీ కీలక నిర్ణయం
సీఎం KCR సహా, మంత్రులు, TRS ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ కూడా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపబోరన్నారు. సోయం బాపురావును బాసర ట్రిపుల్ ఐటీకి పోకుండా అడ్డుకోవడంలో ఆంతర్యం ఏమిటని బండి సంజయ ప్రశ్నించారు. బాసర ట్రిపుల్ ఐటీ ఎంపీ బాపురావు వెళ్తే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటన్నారు. స్థానిక ఎంపీని కూడా ట్రిపుల్ ఐటీకి అనుమతివ్వకపోతే ఎవరికి అనుమతిస్తారని ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.Telangana CM కేసీఆర్ ప్రజల కష్టాలు ఎలాగో తెలియవన్నారు. అందుకే కేసీఆర్ ఎక్కడికి వెళ్లడన్నారు. నీవు వెళ్లవు, ఎవరైనా ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే అడ్డుకొంటావా అని సీఎం తీరుపై బండి సంజయ్ మండిపడ్డారు.
విద్యార్ధుల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి తెలిపే ఉద్దేశ్యంతోనే ఎంపీ బాపురావు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్తున్న సమయంలో అరెస్ట్ చేయడం ఏమిటన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఐదు రోజులు ఉండి ఏం చేశారో చెప్పాలన్నారు.
మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు శనివారం నాడు రాత్రి నుండి ఆందోళన చేస్తున్నారు. మెస్ లోపే బైఠాయించి ఆందోళనుకు దిగారు. శనివారం నాడు రాత్రి భోజనం మానేశారు. ఆదివారం నాడు ఉదయం కూడా టిఫిన్ మానేశారు. ఈ 1. ఈ 2 విద్యార్ధుల ఆందోళన చేస్తున్నారు.
also read:ఇక అలా చేస్తే షోకాజ్ నోటీసులు: బాసర ట్రిపుట్ ఐటీ కీలక నిర్ణయం
మరో వైపు చదువుకోకుండా విద్యార్ధులను అడ్డుకొంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ వెంకటరమణ చెప్పారు. షోకాజ్ నోటీసులు జారీ చేసినా కూడా మార్పు రాకపోతే భర్తరఫ్ చేస్తామని కూడా వీసీ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఏడాది జూన్ 21 నుండి విద్యార్ధులు క్లాసులకు హాజరౌతున్నారు. అయితే జూన్ మాసంలో విద్యార్ధులు వారం రోజుల పాటు ఆందోళన నిర్వహించారు..ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించారు. మంత్రి చర్చలు సఫలం కావడంతో విద్యార్ధులు ఆందోళనను విరమించారు.