ఇక అలా చేస్తే షోకాజ్ నోటీసులు: బాసర ట్రిపుట్ ఐటీ కీలక నిర్ణయం


బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన అధికారులు ఆదివారం నాడు కీలక నిర్ణయం తీసుకొన్నారు. చదువుకునే విద్యార్ధులను అడ్డుకొంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తేల్చి చెప్పారు. 

Basara IIIT decides to issue show cause notice who violate norms

Basara IIT అధికారులు   ఆదివారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలనే డిమాండ్ తో విద్యార్ధులు శనివారం నాడు రాత్రి నుండి ఆందోళన చేస్తున్నారు. ఈ తరుణంలో చదువుకునే విద్యార్ధులను అడ్డుకొంటే Show cause నోటీసులు జారీ చేస్తామని  అధికారులు ప్రకటించారు.  షోకాజ్ నోటీసులు జారీ చేసినా కూడా తీరు మారకపోతే వారిని ట్రిపుల్ ఐటీ నుండి భర్తరఫ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. 

శనివారం నాడు రాత్రి నుండి బాసర ట్రిపుల్ ఐటీ లోని ఈ1, ఈ 2 విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. మెస్ కాంట్రాక్టర్ ను  తొలగించాలని ఆందోళన చేస్తున్నారు. శనివారం  రాత్రి నుండి మెస్ లోనే బైఠాయించి విద్యార్ధులు నిరసనకు దిగారు శనివారం రాత్రి భోజనం మానేసి నిరసనకు దిగారు. ఆదివారం నాడు టిఫిన్ కూడా మానేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో ఇంచార్జీ వీసీ చర్చించారు.  మెస్ కాంట్రాక్టర్ ను  మార్చాలని విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు.  అయితే టెండర్ ప్రక్రియ పూర్తైన తర్వాత మెస్ కాంట్రాక్టర్ ను మార్చే అవకాశం ఉంటుందని వీసీ చెప్పారు. 

ఈ నెల 16న బాసర ట్రిపుల్ ఐటీ లో పుడ్ పాయిజన్ అయింది.ఈ ఫుడ్ పాయిజన్ కారణంగా  మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు.ఈ మేరకు వీసీకి డెడ్ లైన్ విధించారు.ఈ డెడ్ లైన్ లోపుగా కాంట్రాక్టర్ ను మార్చకపోవడంతో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ ను నెరవేర్చేవరకు ఆందోళన సాగిస్తామని కూడా విద్యార్ధులు ఇవాళ ఉదయం ప్రకటించారు. మెస్ కాంట్రాక్టర్ ను మార్చడానికి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.ఈ మేరకు టెండర్ ప్రక్రియ ప్రారంభించారు అధికారులు. అయితే  మెస్ కాంట్రాక్టర్ ను మార్చే వరకు ఆందోళన సాగిస్తామని విద్యార్ధులు చెబుతున్నారు. 

ఈ ఏడాది జూన్ మాసంలో కూడా విద్యార్ధులు వారం రోజుల పాటు ఆందోళన సాగించారు.ఈ ఏడాది జూన్ 20న విద్యార్ధులు తమ ఆందోళనను విరమించారు. జూన్ 21 నుండి విద్యార్ధులు  క్లాసులకు హాజరౌతున్నారు. అయితే ఈ తరుణంలో పుడ్ పాయిజన్ కావడం విద్యార్ధుల ఆందోళనకు కారణమైంది. ఇవాళ విద్యార్ధులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లాలో బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. బీజేపీ నేతలను కూడా జిల్లాలో ముందస్తుగా అరెస్ట్ చేశారు.  బాసర ట్రిపుల్ ఐటీవద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్ధులు బయటకు రాకుండా భద్రతను ఏర్పాటు చేశారు. 

ట్రిపుల్ ఐటీ  ప్రతిష్టను దెబ్బతీసేలా  వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఇంచార్జీ వీసీ వెంకటరమణ మీడియాకు తెలిపారు. ట్రిపుల్ ఐటీ నిబంధనల మేరకే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నామన్నారు. రోజు రోజుకు ట్రిపుల్ ఐటీ లో సౌకర్యాలు మెరుగు పడేలా చేస్తున్నామని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఇటీవల కాలంలోనే సుమారు నాలుగు నుండి ఐదు కోట్లను ఖర్చు చేశామన్నారు. 

also read:బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన: పరామర్శకు వెళ్తున్న ఎంపీ సోయం బాపురావు అరెస్ట్

ఇదిలా ఉంటే బాసర ట్రిపుల్ ఐటీ లో  ఆంక్షలు కొనసాగుతున్నాయి.  బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు మద్దతుగా పేరేంట్స్ కమిటీ హైద్రాబాద్ లో సమావేశమైంది. హైద్రాబాద్ లోని ఎల్బీ నగర్ లో సమావేశమైన పేరేంట్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకొంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించాలని నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు చలో బాసర కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా నిర్ణయించారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios