హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)పై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. పొర్లుదండాలు పెట్టినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. తమ కార్పోరేటర్లను చేర్చుకుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టబోమని ఆయన అన్నారు. 

బండి సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. నాలుగు సార్లు ఓడిపోయాడనే జాలితో ప్రజలు బండి సంజయ్ ను ఎంపీగా గెలిపించారని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మత చిచ్చుపెట్టడానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. 

కేసీఆర్ ఉద్యమ బిడ్డ అని, కేసీఆర్ మీద కేసులు పెట్టినా కూడా తెలంగాణ ప్రజలు సహించబోరని ఆయన అన్నారు కేసీఆర్ ను జైల్లో పెట్టే దమ్ము బండి సంజయ్ కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కొడిుతే మానేరు డ్యామ్ లో పడుతావని ఆయన బండి సంజయ్ ను ఉద్దేశించి అన్నారు. బండి సంజయ్ కు ఇదే మొదటి పదవి, ఇదే చివరి పదవి అని ఆయన అన్నారు. 

Also Read: భాగ్యలక్ష్మి అమ్మవారికి బండి సంజయ్ మొక్కలు: అసదుద్దీన్ మీద ఫైర్

బండి సంజయ్ రాజకీయాల్లో కొత్త బిచ్చగాడని ఆయన అన్నారు. బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోలేదని ఆయన అన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడితే సంజయ్ ను ప్రజలు ఉరికించి కొడుతారని ఆయన అన్నారు. సంజయ్ కు చేతనైతే కేంద్రం నుంచి నీళ్ల వాటా తీసుకుని రావాలని ఆయన అన్నారు. బిజెపి మూర్ఖులు మత ఘర్షణలు పెట్టాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బండి సంజయ్ మూర్ఖుడని, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు.