అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం గుమ్మటాలు కూల్చేస్తాం: బండి సంజయ్ సంచలనం

అసదుద్దీన్ కళ్లలో ఆనందం చూసేందుకు   కొత్త సచివాలయాన్ని  తాజ్ మహల్  మాదిరిగా  నిర్మించారని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.  

BJP Telangana President  Bandi Sanjay  Sensational Comments  On  New Secretariat

హైదరాబాద్:  తమ పార్టీ అధికారంలోకి రాగానే  కొత్త సచివాలయం  గుమ్మటా లను కూల్చివేస్తామని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  చెప్పారు.జనం గోస – బీజేపీ భరోసాలో భాగంగా  హైద్రాబాద్   కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినిపల్లి లో 77, 78,79 వార్డులల్లో  స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను  బండి సంజయ్ శుక్రవారం నాడు   ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  ప్రసంగించారు.  

తెలంగాణలో నిజాం వారసత్వ సంస్కృతి,ని  ధ్వంసం చేస్తామన్నారు.    నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని  బండి సంజయ్  చెప్పారు.   భారతీయ, తెలంగాణ సంస్కృతి  ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తీామన్నారు. రోడ్డుకు అడ్డం ఉంటే మసీదులు, మందిరాలు కులుస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావిస్తూ  దమ్ముంటే  పాతబస్తీలోని రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చాలని  కోరారు.  

అసదుద్దీన్ ఓవైసీ కళ్లలో  ఆనందం  చూసేందుకుగాను  సచివాలయాన్నితాజ్ మహల్ మాదిరిగా నిర్మించారని  బండి సంజయ్ విమర్శించారు.  తాము అధికారంలోకి రాగానే  కొత్త సచివాలయంలో   మార్పులు చేర్పులు చేస్తామని  ఆయన తేల్చి చెప్పారు.   తెలంగాణ సంస్కృతి,  సంప్రదాయాలు  ఉట్టిపేడేలా  సచివాలయంలో మార్పులు ఉంటాయని  బండి సజంయ్  ప్రకటించారు.  అంతేకాదు  ప్రగతి భవన్ ను ప్రజాదర్భార్ గా మారుస్తామని ఆయన  ప్రకటించారు. 

అసెంబ్లీ లో బీఆర్ఎస్, ఎంఐం కలిసి నాటకం ఆడుతున్నాయన్నారు. కూకట్ పల్లి లో పేదల భూములను కబ్జా చేశారని ఆయన  ఆరోపించారు.   బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారని  బండి సంజయ్  చెప్పారు. రాష్ట్రంలో 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పెడుతున్నట్టుగా  బండి సంజయ్  తెలిపారు.  ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడి ప్రజలు బీజేపీని గెలిపిస్తున్నారన్నారు.  

బీఆర్ఎస్ మూర్ఖత్వ పాలనను ప్రజలకు వివరించేందుకు  స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు ఏర్పాటు  చేస్తున్నామని  బండి సంజయ్ తెలిపారు.  మోడీ పాలనా విజయాలను ప్రజలకు  వివరిస్తామన్నారు..సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కు పరిమితం అయ్యారన్నారు.  ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఈ రోజుకి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదని  చెప్పారు. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం  హైదరాబాద్  నుండే వస్తోందన్నారు. హైదరాబాద్ ను ఏ మేరకు అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలని ఆయన కేసీఆర్ ను డిమాండ్  చేశారు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios