న్యూఢిల్లీ: కేసీఆర్  ప్రభుత్వ అక్రమాలపై  కోర్టులను ఆశ్రయిస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.

సోమవారం నాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా ఆయన హైద్రాబాద్ నుండి న్యూఢిల్లీకి చేరుకొన్నారు. విజయశాంతి బీజేపీలో చేరిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.

also read:ఢిల్లీకి బండి సంజయ్: జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత తొలిసారి హస్తినకు

కేసీఆర్ అవినీతి చిట్టా మా చేతిలో ఉందన్నారు.  ఈ అవినీతి చిట్టా ఆధారాలతో సహా కోర్టులో రుజువు చేసే ప్రయత్నం చేస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు అవినీతిని బయటపెడతామన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిపై సాక్ష్యాలతో సహా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆయన చెప్పారు.కేసీఆర్ సర్కార్ పై బీజేపీ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కేంద్రం నుండి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.