Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ సర్కార్ అవినీతిని బయట పెట్టాలి: తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా

టీఆర్ఎస్ సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతలకు సూచించారు.టీఆర్ఎస్ సర్కార్ బియ్యం కుంభకోణం సహా ఇతర కుంభకోణాలను వెలికి తీయాలని ఆయన పార్టీ నేతలను కోరారు. ఈ కుంభకోణాల గురించి ప్రజలకు వివరించాలన్నారు

Bjp Telangana leaders meeting with Union minister Amit shah
Author
Hyderabad, First Published Dec 21, 2021, 4:49 PM IST | Last Updated Dec 21, 2021, 4:54 PM IST

హైదరాబాద్ : కేసిఆర్ అవినీతికి సంబంధించిన అన్ని అంశాలను బయటపెట్టి ప్రజలకు వివరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shah  తెలంగాణ Bjp నేతలకు సూచించారు. తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు మంగళవారం నాడు పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. Huzurabad bypoll  తరహాలోనే రాబోయే ఎన్నికల్లో గెలవాలని అమిత్ షా కోరారు. kcr కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా ఏమి చేయాలో తమకు  వదిలేయాలని కేంద్ర మంత్రి పార్టీ నేతలకు సూచించారు. కేంద్రం మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇకపై Telanganaలో తరచూ పర్యటిస్తానని అమిత్ షా హామీ ఇచ్చారు.

also read:బీజేపీ నేతలతో నేడు అమిత్ షా భేటీ: తెలంగాణపై కాషాయ దళం ఫోకస్

బీజేపీపై Trs  చేసే ఆరోపణలను అదే స్థాయిలో తిప్పికొట్టాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో నిత్యం ప్రచారం చేయాలని కేంద్ర మంత్రి కోరారు. టీఆర్ఎస్ సర్కార్ బియ్యం కుంభకోణం సహా ఇతర కుంభకోణాలను వెలికి తీయాలని ఆయన పార్టీ నేతలను కోరారు. ఈ కుంభకోణాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay  తలపెట్టిన పాదయాత్రను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదే తరహలో ఇతర కార్యక్రమాలను చేపట్టాలని అమిత్ షా సూచించారు. అంతకుముందు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన  ఈటల రాజేందర్ ను కేంద్ర మంత్రి అమిత్ షా అభినందించారు.దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలోని తెలంగాణపై ఆ పార్టీ  కేంద్రీకరించింది. తెలంగాణ రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ దఫాలు పర్యటించనున్నట్టుగా కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. 

Bjp Telangana leaders meeting with Union minister Amit shah

బండి సంజయ్ తో 15 నిమిషాలు భేటీ అయిన అమిత్ షా

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా సమాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios