నెరవేర్చని హామీలపై చర్చకు మేం సిద్దం:కేసీఆర్‌కి తరుణ్ చుగ్ సవాల్
ప్రజలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చని హామీలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తోచర్చకు తాము సిద్దంగా ఉన్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ తరుణ్ చుగ్ చెప్పారు. ఈ బహిరంగ చర్చకు కేసీఆర్ వస్తారో లేదో చెప్పాలన్నారు. తమ పార్టీ తరపున బండి సంజయ్ హాజరౌతారన్నారు.
హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చకుండా వాటిపై చర్చకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దంగా ఉన్నాడో లేడో చెప్పాలని BJP తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ చెప్పారు.
మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై తాము బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. తమ పార్టీ తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay ఈ బహిరంగ చర్చకు వస్తారన్నారు. ఈ చర్చకు తెలంగాణ సీఎం KCR హాజరౌతారో లేదో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. జాాతీయ పార్టీ అంటూ కేసీఆర్ కలలు కంటున్నారన్నారు. TRS , BRSలకు బీజేపీ భయపడదని ఆయన తేల్చి చెప్పారు. Telangana ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే భయంతో కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రం వదిలి వెళ్లేందుకు సిద్దమయ్యారన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ మేరకు ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెసేతర సీఎంలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ విషయమై బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నాయి. కొంత కాలంగా బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.