మరో 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దం: బండి సంజయ్ సంచలనం
రాష్ట్రంలో మరో 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దంగా ఉన్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా గురువారంనాడు ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 12 మంది TRS ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దంగా ఉన్నారని బీజేపీ తెలంగాణచీఫ్ Bandi Sanjay చెప్పారు. గురువారం నాడు ఆయన భువనగిరి జిల్లాలో పాదయాత్రకు బయలు దేరే ముందు మీడియాతో చిట్ చాట్ చేశారు.ఈ చిట్ చాట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రజలతో ఒత్తిడి చేయించుకుని రాజీనామా చేయబోతున్నారన్నారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఇప్పటికే 10 నుంచి 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై, తమ భవిష్యత్ ఏంటి అని ఆలోచించుకుంటున్నారన్నారు.
KCR కుటుంబంపై అనేక ఆరోపణలు వస్తున్నాయన్నారు..దీంతో టీఆర్ఎస్ లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి ఎమ్మెల్యేలు వచ్చారన్నారు. చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో దందా వెనుక కేసీఆర్ కుటుంబ హస్తంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తం ఉందని బండి సంజయ్ ఆరోపించారు.
నయీం కేసుతోపాటు మొత్తం వ్యవహారంపై BJP అధికారంలోకి వచ్చాక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నయీం ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కొనుగోలు చేయొద్దని ఆయన సూచించారు.నయీమ్ ను ఎన్ కౌంటర్ చేయించిందే కేసీఆర్ కుటుంబమన్నారు.. నయీం అరాచకాల వెనుక టీఆర్ఎస్ హస్తముందన్నారు. అనుకోని ఇబ్బంది రావడంతోనే నయీం ను ఎన్ కౌంటర్ చేయించారని బండి సంజయ్ ఆరోపించారు. . బీజేపీ ప్రభుత్వం వస్తే నయీం కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. నయీమ్ బాధితులను ఆదుకుంటామన్నారు
Munugode ఉప ఎన్నికలో బీజేపీ గెలిచి తీరుతుందని బండి సంజయ్ ధీమాను వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దనుందన్నారు. భువనగిరి ఎంపీ Komatireddy Venkat Reddy మొదటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరతారని వార్తలను తాను చూసినట్టుగా చెప్పారు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నాడన్నారు. . చాలా సందర్భాల్లో మోడీ పాలనను అభినందించారన్నారు. . బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వాన్ని నమ్మి వచ్చే వాళ్లందరినీ బీజేపీలోకి ఆహ్వానిస్తామన్నారు.అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారని గుర్తు చేశారు.
RTC ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు కేసీఆర్ మళ్లీ తెరలేపారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 62 సీట్లతోపాటు 47 నుండి 53 శాతం ఓట్లు వస్తాయని అనేక సర్వే సంస్థల నివేదికలు వెల్లడించాయని ఆయన చెప్పారు.
పాలమూరు జిల్లాలో తన పాదయాత్ర సమయంలో జర్నలిస్టులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయం తన దృష్టికి తీసుకువచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే. మీడియా ప్రతినిధులకు ఇండ్లు కట్టిస్తామన్నారు. హెల్త్ కార్డులు, ఇండ్ల తో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
డ్రగ్స్ స్కామ్ లో ముందు కేసీఆర్ ప్రభుత్వం హడావిడి చేసిందన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ స్కామ్ ను నీరు గార్చిందన్నారు. చీకోటి క్యాసినో వ్యవహారం కూడా కేసీఆర్ సర్కార్ ఇదే రకంగా వ్యవహరించనుందని ఆయన విమర్శించారు.
Chikoti Praveen వ్యవహరంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులున్నారని ఆయన ఆరోపించారు. .చీకోటి వ్యవహారం లో కేసీఆర్ కుటుంబం పాత్రపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ వ్యవహరం బయటకు రాగానే కేసీఆర్ కుటుంబం సైలెంట్ అయిపోయిందన్నారు.
మునుగోడు ఉప ఎన్నికతో కేసీఆర్ పతనం పతాక స్థాయికి చేరుకుంటుందన్నారు.మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది బీజేపీయేనని ఆయన చెప్పారు..కాళేశ్వరం మునగడానికి కేసీఆరే ప్రధాన కారణంగా ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వస్తే తప్పకుండా ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు.
బీజేపీలో అంతర్గత విబేధాల్లేవన్నారు. పార్టీ నేతలంతా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు మాత్రమే బీజేపీలో స్థానం ఉంటుందన్నారు..
రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుని తీరుతామని బండి సంజయ్ ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తమకు 60 పై అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
also read:మునుగోడుపై కాంగ్రెస్ ఫోకస్:రేపు చండూరులో సభ
ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఈనెల 6న ఓటేసేందుకు ఢిల్లీ వెళుతున్నందున ఆ రోజు పాదయాత్రకు విరామం ఇస్తున్నట్టుగా ఆయన వివరించారు. తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.7 లక్షలకుపైగా ఇండ్లు మంజూరు చేయడంతోపాటు దాదాపు 4 వేల కోట్లు విడుదల చేసిందని బండి సంజయ్ చెప్పారు.