Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ భాగ్యలక్ష్మి ఆలయంలో బండి సంజయ్ పూజలు: తొలి విడత పాదయాత్ర పూర్తి

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆదివారం నాడు హైద్రాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.తొలి విడత పాదయాత్ర అక్టోబర్ 2వ తేదీన బీజేపీ ముగించింది.  మలివిడత పాదయాత్రను హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల తర్వాత కొనసాగించే అవకాశం ఉంది.

BJP telangana chief Bandi Sanjay completes first phase padayatra
Author
Hyderabad, First Published Oct 3, 2021, 9:35 AM IST

హైదరాబాద్: బీజేపీ  (Bjp telangana chief)తెలంగాణ చీఫ్  బండి సంజయ్ (Bandi sanjay)  హైద్రాబాద్ పాతబస్తీలోని బాగ్యలక్ష్మి ఆలయంలో (bhagya laxmi temple) ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండి సంజయ్ పాదయాత్ర 36 రోజుల్లో 438 కి.మీ పూర్తి చేసుకొంది. 

హైద్రాబాద్(hyderabad) భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో  ఆదివారం నాడు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 9 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించారు.హుజూరాబాద్ అసెంబ్లీ(huzurabad bypoll) ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బండి సంజయ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.  అక్టోబర్ 30వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్  బరిలో దిగనున్నారు.

ఇప్పటికే బీజేపీ కీలక నేతలు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున ఈ నియోజకవర్గంలో విస్తృతంగా బీజేపీ నేతలు ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కమలనాథులు వ్యూహారచనను సిద్దం చేశారు.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పూర్తైన తర్వాత బీజేపీ చీఫ్ బండి సంజయ్  రెండో విడత పాదయాత్ర కొనసాగించే అవకాశం ఉంది. పాదయాత్ర ముగించినందున ఇవాళ పాతబస్తీ భాగ్యలక్ష్మి  ఆలయంలో బండి సంజయ్  పూజలు నిర్వహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios