Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ 2023: తెలంగాణలో బీజేపీ మరింత దూకుడు

తెలంగాణలో టీఆర్ఎస్ పై బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్తోంది. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో ఆ పార్టీ ముందుకు వెళ్తోంది. ఈ మేరకు బీజేపీ నాయకత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకొంటుంది. టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతుంది.
 

BJP Slowly and Steadily Made Inroads Into Telangana
Author
Hyderabad, First Published Dec 26, 2021, 3:16 PM IST


హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో Trs పై బీజేపీ దూకుడును మరింత పెంచింది. Bjp  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay  నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్ర మంత్రి Amit Shah తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్ర నేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  దిశా నిర్ధేశం చేశారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి Etela Rajender విజయం సాధించడంతో కమల దళంలో ఉత్సాహం రెట్టింపు అయింది.  అయితే అదే సమయంలో Paddy  కొనుగోలు అంశాన్ని టీఆర్ఎస్ చీఫ్ Kcr తెర మీదికి తీసుకొచ్చారు. పంజాబ్ రాష్ట్రంలో  కొనుగోలు చేసినట్టుగానే రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు చేయాలని  కేసీఆర్ సర్కార్ డిమాండ్ ను ముందుకు తీసుకొచ్చింది. అయితే వర్షాకాలంలోని వరి పంటను మొత్తం కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.  ఈ విషయమై వరి కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. అయితే బండి సంజయ్ ను వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకొన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ రెండు రోజుల టూర్ సమయంలో  బీజేపీ,టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.

also read:తెలంగాణలో జనవరి 2 వరకు ఆంక్షలు: బండి సంజయ్ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు

Huzurabad bypoll ఫలితాలు వెలువడకముందే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యాలయంలోనే బండి సంజయ్ ఒక్క రోజు దీక్ష నిర్వహించారు. దీనికి కొనసాగింపుగానే వరి ధాన్యం కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

యాసంగిలో రాష్ట్రంలో పండిన వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుండి స్పష్టత రాలేదు. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల్లో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే రానుంది. దీంతో బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. అయితే గతంలో  బాయిల్డ్ రైస్ తాము ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ ఇచ్చింది. దీంతో  బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చి చెప్పింది.

రా రైస్ విషయమై మార్చి మాసంలో ఆలోచిద్దామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభ వేదికగా ప్రకటించారు. అయితే యాసంగి ధాన్యం విషయమై టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై బీజేపీ అంతే స్థాయిలో ఎదురు దాడికి దిగింది.బాయిల్డ్ రైస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ ఇచ్చి మళ్లీ ఇప్పుడు కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. గతంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖలను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాకు అందించారు.

వరి ధాన్యం విషయమై బీజేపీపై,, కేంద్రంపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన విమర్శలకు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.నిరుద్యోగుల సమస్యను బీజేపీ ఆందోళనలకు శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 27న ఒక్క రోజు దీక్షకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.Telanganaలో టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రభుత్వ ఉద్యోగాల  భర్తీ విషయమై విపక్షాలు టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నాయి. అంతేకాదు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇస్తామని కూడా టీఆర్ఎస్ సర్కార్ హామీ ఇచ్చింది. అయితే నిరుద్యోగ భృతిని అమలు చేయలేదు. నిరుద్యోగుల సమస్యలపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ దీక్షను తలపెట్టారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్తిస్తున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ నేతలు ఈ దూకుడును మరింత పెంచే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిని బయట పెట్టాలని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ నేతలకు సూచించారు. ఈ విషయమై ప్రజలకు విస్తృతంగా వివరించాలని కూడా కోరారు. గతంలో కూడా కేసీఆర్ అవినీతిని తాము బయట పెడతామని బీజేపీ నేతలు గతంలో పలుమార్లు ప్రకటించారు.

వరి ధాన్యం కొనుగోలు అంశంపై కూడా అవకతవకలు చోటు చేసుకొన్నాయని కూడా బీజేపీ నేతలు పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  బీజేపీ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ కు నెలకొంది.  రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలకు కూడా బీజేపీ నాయకత్వం ప్లాన్ చేసే అవకాశం ఉంది.

బండి సంజయ్ పాదయాత్ర హుజూరాబాద్ ఎన్నికల ముందు ముగిసింది. రెండో విడత పాదయాత్రను బండి సంజయ్ చేపట్టనున్నారు. బండి సంజయ్ తరహలోనే పార్టీ నేతలు పాదయాత్రలు చేయాలని కూడా అమిత్ షా సూచించారు.  క్షేత్ర స్థాయిలో సమస్యలను తీసుకొని యాత్రలు చేయాలని కేంద్ర నాయకత్వం సూచించింది.  దీంతో బీజేపీ నేతలు మరింత దూకుడుగా కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉంది.

మరో వైపు కాంగ్రెస్, టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలను తమ వైపునకు తిప్పుకొనేందుకు కమల దళం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. కీలక నేతలకు కూడా బీజేపీ నాయకత్వం గాలం వేస్తోందనే ప్రచారం సాగుతుంది.2023లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ నేతలు ముందుకు వెళ్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios